
KASHMIR AAGRAHA KARANAALU
₹250
In stock · 6 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076237
ముందుమాట కశ్మీర్ సంక్షోభానికి ఒక పరిష్కారం సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో, అత్యవసరంగా పరిష్కారం కావాల్సిన వాటిలో కశ్మీర్ సంక్షోభం ఒకటి. సంక్లిష్టమైన కశ్మీర్ విషయాన్ని అర్ధం చేసుకోకపోవటం కూడా ఈ సవాళ్లలో ఒకటి. 2019 ఆగస్టు 5న కశ్మీర్ ప్రత్యేకహోదాను రద్దు చేయటం, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా దిగజార్చటం, సామూహిక అరెస్టులు చేయటం, ఇవన్నీ చేయటానికి భద్రతా కట్టడులను విధించటం -కశ్మీర్ లోయను వ్యధలలోకి, ఇంకాస్త సంక్షోభంలోనికి దించటానికి ఉపయోగపడ్డాయి. భారతదేశంలో అత్యంత కల్లోలిత ప్రాంతం అయిన కాశ్మీర్లో ఏమి జరుగుతుందో తెలుసుకొనే విషయంలో పట్టు దొరకాలంటే కశ్మీరీలు చెప్పేది వినటమే అన్నిటికంటే సరైన పద్దతి. తనదైన ప్రత్యేక ముద్ర ఉండి, ఎంతో అనుభవం ఉన్న వ్యాఖ్యాత, జర్నలిస్టు గౌహర్ గిలానీకి కశ్మీర్ కల్లోలం విషయంలో సాధికారత వుంది. ఆ కల్లోలం గురించి ఆయన నిజాయితీగా, ఆవేశకావేషాలకతీతంగా మన ముందుంచాడు. ఇంతకుముందు బయటవాళ్లు చెప్పిన కథనాలను కశ్మీరీలు తమ సొంత కథనాలుగా ఇప్పుడు ఎలా తిరిగి చెబుతున్నారో, శక్తివంతమైన భాష్యంతో గౌహర్ గిలానీ సమగ్రంగా వివరిస్తున్నాడు. ఈ రకమైన భాష్యానికి గిలానీ పుస్తకమే ఒక మైలురాయి. కశ్మీరీలు ఏమి భావిస్తున్నారో, వత్తిడి ఎక్కువైన చోట బతకటం ఎలా ఉంటుందో తెలియచేయటానికి గిలానీ తన గొంతుకను ఇస్తున్నాడు. తన అనుభవంతో, తాను చేసిన ఇంటర్వ్యూలతో, తను రాసిన కథనాలతో, కాశ్మీరీలు అంత ఆగ్రహంగా ఉండటాన్ని వివరించటానికి అవసరమైన పదునైన వివరణలతో ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు. గిలానీ స్పష్టంగా, నిష్పక్షపాతంగా ఉన్నాడు. బుర్హాన్ వనిని చంపటం దగ్గర నుండి వచ్చిన ప్రతిఫలనాలు, కశ్మీరీ పండితుల ఫిర్యాదులు, కాశ్మీరీ లోయను ఉచ్చులో పడేసిన ఆగ్రహం, హింసల వ్యక్తీకరణ కోసం సాహిత్యం, కవిత్వం, కథలలో చోటు చేసుకొన్న మార్పులు -గిలానీ పుస్తకం ఈ విషయాలనన్నింటినీ తడుముతుంది.