KASHMIR BAHIRANGA CHERASALA by MALUPU BOOKS Telugu book cover

KASHMIR BAHIRANGA CHERASALA

by MALUPU BOOKS

₹170
In stock · 2 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076206
ముందుమాట రాజ్యాంగానికి వెన్నుపోటు ఏదో జరగబోతోందన్న సూచనలు కనిపించాయి. అదే జరగబోతోందన్న ఊహలు కూడా వినిపించాయి. అయినా, ఆగస్టు 5వ తేదీ ఉదయం ఖచ్చితంగా అదే జరిగేటప్పటికి దిగ్భ్రాంతి. ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయిన పరిస్థితి. అనేక వాదనల, ఆలోచనల, ఊహల, పరిష్కారాల ప్రాతిపదికలన్నిటికీ కాళ్లకింద నేల కదిలిపోయింది. మన హృదయాలు కోతపడి, మెదళ్లు స్తంభించిపోయిన ఆ సమయంలోనే, వెనువెంటనే, నూతన పరిస్థితుల నవీన కథనం నిర్మితం కావడం మొదలయింది. ఆర్టికల్ 370 కశ్మీరీల జీవితాలను భద్రంగా, నిరపాయకరంగా ఉంచుతున్నదని కాదు. 370 ఆర్టికల్ ఏ యువకుడికీ యువతికీ, ఏ బాలుడికీ బాలికకీ భవిష్యత్తును వాగ్దానం చేసేస్థితిలో లేదు. పుట్టినప్పటి నుంచి ఆ అధికరణాన్ని కొద్దికొద్దిగా చంపుతూనే వస్తున్నారు. అది తనను తానే కాపాడుకోలేదు. ప్రజలకేమి పూచీపడుతుంది? ఇది కశ్మీరీల కల్లోల జీవితంలో కొత్తగా ఒక పిడుగు పడినట్టు బాధపడడం కాదు. కశ్మీర్లో ఏదో ఒక చారిత్రక ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి ఆయుధాలు పట్టుకుని పోరాడుతున్న వారికి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కష్టమేమీ లేదు. 370 నుంచి చివరి ప్రాణపు బొట్టును కూడా పిండేయడం ద్వారా నష్టపోయింది ప్రజాస్వామిక శక్తులూ, ప్రజాస్వామిక ప్రక్రియలూ మాత్రమే. ఆ నష్టం కశ్మీర్ కే పరిమితం కాదు. జమ్ముకశ్మీర్ లో భారతదేశంతో కలసి ఉండడానికి చరిత్ర ఒక ప్రాతిపదిక ఇచ్చింది. అది విశ్వాసం నమ్మకం వంటిది కాదు. అనేక సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి కొన్ని పద్ధతులను అనుసరించాయి. వాటి పాలకులు కొన్ని రాయితీలు, సదుపాయాలు పొంది తమ భూభాగాలను భారత్లో విలీనం చేశారు. మరి కొన్ని దేశీయ రాజ్యాలు, ముఖ్యంగా భూభాగం అధికంగా ఉన్న రాజ్యాలు భిన్నమైన పద్ధతిలో బేరసారాలు జరిపాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జమ్మూకశ్మీర్ భారత్తో అనుసంధానం అయింది. అందుకోసం ఒక అవగాహనతో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని రాజ్యాంగంలో 370 అధికరణం రూపంలో పొందుపరిచారు. భారత్లో కశ్మీర్ ఉనికి ప్రత్యేకంగా, విశిష్ట ప్రతిపత్తితో ఉండేటట్టు ఆ అధికరణం రూపొందించారు.