
KASHMIR NIRBANDHA KATHANALU SMASANASANTHI
by MALUPU BOOKS
₹190
In stock · 2 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076220
ఇవి కశ్మీర్ కల్లోల కాలంలో విభిన్నరంగాల వ్యక్తులు పడిన కష్టాల కథలు, వెతలు, లోతైన ఆలోచనలు. ఇన్నిన్ని ఘోరాలు చేస్తూ ఉంటే, మొత్తం ప్రజ మీద అవమానాలు ఇంతగా రుద్దుతూ ఉంటే ఏ ప్రభుత్వంగానీ సమాజంగానీ తామేదో ఘనకార్యం సాధించినట్టు భావించడం ఎలా సాధ్యమవుతుందో అని నాకు ఈ పుస్తకం చదివిన తరువాత ఆశ్చర్యం కలుగుతున్నది. ఇది అక్కడి వాస్తవ చిత్రమే కాదు, అక్కడి సమస్యపైన సమంజసమైన విశ్లేషణ కూడా. ఈ విధంగా చెప్పగల్గడం అంత సులువు కాదు. చాలామంది చదవాలని కోరుకుంటున్నాను. అరుంధతీ రాయ్ 1947లో కశ్మీరు భారతదేశంతో చేర్చినపుడు భారత్ పాకిస్తాన్ దేశాలలో అనేక అభ్యంతరాలు తలెత్తాయి. ఆ గొంతుకలు ఇప్పటికీ వినబడుతున్నాయి. షేక్ అబ్దుల్లా కశ్మీర్ లో ఒకప్పుడు మకుటం లేని మహరాజు. కాని ఇవ్వాళ ఆయన సమాధికి భద్రత అవసరమైంది, లేకపోతే చెడగొడతారు. ఆలోచనల్లో ఇంతటి మార్పుకు కారణమేమిటి? కశ్మీర్ శ్మశానశాంతి పుస్తకం కశ్మీరీల రాజకీయ ఆకాంక్షలను, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వారి అవగాహనలో వచ్చిన మార్పులను సమగ్రంగా విశ్లేషిస్తుంది. కశ్మీరీల తమదైన డిమాండ్ ఆజాదీ. ఇది వారి చారిత్రక డిమాండ్. వారి ఈ ప్రగాఢ వాంఛ పరిణామక్రమాన్ని తెలియజేస్తూ కశ్మీరీ రచయితలు రచించిన వ్యాసాల సంకలనం ఇది. 1947 నుంచి 1989లో మిలిటెన్సీ మొదలైనప్పటిదాకా సాగిన కశ్మీరీల ఆశలను, జీవనాన్ని వివరిస్తూనే, ఆంగ్లేయ వలస పాలనానంతర రాజకీయాలను లోతుగా పరిశీలిస్తూ ఈనాటి వివాదానికి దారితీసిన పరిస్థితులను ప్రస్తావించే కథనాలు ఇవి. కశ్మీర్లో ఉన్నది కేవలం శాంతి భద్రతల సమస్యా, లేక ప్రచ్ఛన్న యుద్దమా, విస్తరిస్తున్న టెర్రరిజమా అనే ప్రశ్నలకు కశ్మీరీ రచయితల గుండెలోతుల్లో నుంచి వచ్చిన అనుభవాల ఆధారిత వ్యాసాలు సమాధానాలు చెబుతాయి.