
KASHYAPA SHILPOKTHA PRATHISHTA VIDHI
by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA
₹150
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
కాశ్యపశిల్ప ప్రతిష్ఠావిధి కాశ్యపశిల్పశాస్త్రం ప్రతిపాదించిన ప్రతిష్ఠాగ్రంథం ఇది. కాశ్యపశిల్పశాస్త్రం అనువాదమై ప్రచురణ జరిగింది కానీ చాలా కాలం వరకూ దానికి సంబంధించిన ఈ ప్రతిష్ఠాగ్రంథం విడుదలవ్వలేదు. ఆ లోటును గ్రహించిన బ్రహ్మశ్రీ కందుకూరి వేంకట గోవిందేశ్వరశర్మగారు దీనిని కన్నడభాష నుండి తెలుగులోకి అనువదించారు. శిల్పాచార్యుడిని దేవతా విగ్రహం నిర్మించి ఇవ్వమని కోరిన సమయం నుండి ఆ విగ్రహం నిర్మాణం జరిగే తీరు.. ఆపై విగ్రహప్రతిష్ఠ కోసం జరిపే క్రియలు. అధివాసాలు, హెూమాలు, శిల్పిపూజ, ప్రాణప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం మొదలైన విశేషాలన్నీ క్రియాపూర్వకంగా వివరించింది. సాధారణంగా విగ్రహానికి అధివాసాలు చేస్తాం. కానీ ఆలయానికి కూడా అధివాసం చేయమని ఈ గ్రంథంలో ఉటంకించారు. అలాగే శిల్పాచార్యపూజ మొదలైన విశేషాలెన్నో ఉన్న ఈ గ్రంథం ప్రతి ఆగమీకుడి ఇంటా ఉండవలసినది.