KATHA - 2013 by VASIREDDY NAVEEN Telugu book cover

KATHA - 2013

by VASIREDDY NAVEEN

₹60
In stock · 2 available
PublisherVASIREDDY NAVEEN
LanguageTelugu
మా మాట ఇది 24వ సంకలనం. గత 24 సంవత్సరాలుగా 154 మంది రచయితల 325 కథలతో కథాసాహితి పాఠకులతో చేసే కరచాలనం ఈ సంకలనాల పరంపర. ఈ పని మొదలు పెట్టి వచ్చే ఏడాదికి పావు శతాబ్దం అంటే పాతికేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భానికి గుర్తుగా కథకు సంబంధించి ఏదైనా ఒక మంచి ప్రచురణతో పాఠకుల ముందుకు రావాలని ప్రయత్నం. ఇందుకోసం సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా పాఠకులను, కథాభిమానులను కోరుతున్నాం. ఇన్నేళ్ల ఈ ప్రయాణం ఇలాగే పాఠకుల ఆదరణ ఉన్నంతకాలం నిరంతరం సాగుతుందనే నమ్మకం ఉంది. 2013లో వివిధ పత్రికలు, అంతర్జాల పత్రికలు, సంచికలు, కథాసంపుటాలలో వచ్చిన వందలాది కథల నుండి మీరు చదవబోతున్న ఈ 14 కథలను మేము ఉత్తమమైనవిగా భావించి, ఎంపిక చేసి మీ ముందుంచుతున్నాం. వీటిల్లో అన్ని కథలూ అందరికీ నచ్చుతాయనేది అత్యాశే. అయినా మాకు నచ్చిన కథలు పాఠకు లకు కూడా నచ్చుతాయనే నమ్మకంతో ఎంపిక చేసినవి. ఏది ఏమైనా పాఠకులు, విమర్శకులదే అంతిమ తీర్పు. కె. శివారెడ్డి, కాళీపట్నం రామారావు, జంపాల చౌదరి మా యీ ప్రయత్నానికి పెద్ద అండ. వీరితో పాటు భమిడిపాటి జగన్నాథరావు, అల్లం రాజయ్య, చేకూరి రామారావు, నవోదయ రామ్మోహనరావు, పెనుగొండ లక్ష్మీనారాయణ వంటి అనేక మంది సాహితీమిత్రుల, పెద్దల ఆశీస్సులు మాకు అదనపు బలం. ఈ సంకలనాలు ఇలా అందంగా రూపొందటంలో సహకరిస్తున్నది అక్షర సీత. అచ్చువేస్తున్నది పరుచూరి సుబ్బయ్య. వీరు కూడా ఈ ప్రయత్నంలో భాగమే. వివిధ పత్రికల్లో ఈ కథలు అచ్చయినపుడు వాటికి చిత్రకారులు వేసిన బొమ్మలనే ఈ సంకలనానికీ వాడుకున్నాం. వారికి కృతజ్ఞతలు. గోదావరిఖని నుంచి అనంతపురం, విజయనగరం వరకూ ఆంధ్రదేశంలోని వివిధ నగరాల్లోనూ, బెంగుళూరు, ఢిల్లీ, ఫిలడెల్ఫియాలతో సహా 19 చోట్ల ఈ సంకలనాల ఆవిష్కరణ సభలను ఉత్సవంలా నిర్వహిస్తున్న సాహితీమిత్రులందరికీ కృతజ్ఞతలు.