KATHA 2019 (1990-2019) by VASIREDDY NAVEEN, AND DR.PAPINENI SIVASHANKAR Telugu book cover

KATHA 2019 (1990-2019)

by VASIREDDY NAVEEN, AND DR.PAPINENI SIVASHANKAR

₹125
In stock · 5 available
PublisherVASIREDDY NAVEEN
LanguageTelugu
కొట్రవ్వ మన్నం సింధుమాధురి “రేపు మనూరిలో పెంటె కట్టిన గొర్రెల గుంపుని పంచుతున్నారంట. పంచాయితీ ఉంది. ఆందరం పెందలకాడ కట్టి దగ్గరికి పోవాలి. నలుగు రన్నదమ్ములూ అన్ని గొర్రెల్ని, గుర్రాల్ని, కోళ్లని, కుక్కల్ని పంచుకుంటా రంట. కొట్రవ్వ మొగుడికి పచ్చవాతం తగ్గిందంట. ఆడి మందని ఆడికి క్యాంపులో వాళ్లు ఇప్పిస్తారంట. ఇవీ సంగతులు బుజ్జమ్మా,” అని చెప్పాడు పాలేరు ఎంకోబు. “ఎందుకు విడిపోతున్నారు. పెద్దమంద కదా?” అన్నాను. “ఆమ్మనడగండి చెప్పుద్ది," అన్నాడు, సావిట్లో ఎలిచి మీద చిక్కాలు లాగుతా. మా ఊరికొచ్చే గొర్రెల మందలు, ఆ గొర్రెల వాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఇక కొట్రవ్వ గొర్రెలు, మేకల మంద అంటే నేనాడింది ఆట, పాడింది పాట. సంక్రాంతికి పంటలు కొయ్యంగానే కొట్రవ్వ గొర్రెల మంద ఊళ్లోకి వస్తుంది. రావటం కూడా భలే అందంగా... ముందు ఓ పది గుర్రాలు, ఒకదాని వెంట ఒకటి బారులుగా, వాటిపైన వలలని సంచిలా వేలాడదీసి వాటిలో తెల్లగా తోమిన సీవెండి గిన్నెలు, తపేళాలు, కొన్ని బట్టలు, జొన్నలు, సజ్జలు, రాగులు; వెనక గుర్రాల మీద కూతురు, కొడుకు; వాటి వెనకాలే నడుచుకుంటా కొట్రవ్వ. మొగుడు మాత్రం తెల్లటి పంచెకట్టు, మరాఠా టోపీ, నల్లమీసాలు, నల్లటిరంగు తోలుతో గచ్చకాయలు మార్చి కుట్టిన కిర్రుచెప్పులు, చేతిలో అర్ధచంద్రాకారపు ఉక్కుముక్క గొడ్డలి, నుదుటి మీద బండారు (ఒక లాంటి పసుపు సిందూరం) తో హుందాగా నడిచి వస్తంటే, ముందునించి వెనక్కి వెళ్లి ఆవులు, గిత్తలు సరిగ్గా వరసలో వస్తన్నయ్యో లేదో అని చూసే కొట్రవ్వ మరాఠి నాయికలా ఉండేది. “ఏదో సినిమాలో ఉన్నట్టు ఏడుగజాల ఇలకల్లు నేతచీర, సంకలో తెల్లముక్క మాసిక రవికె, ఎర్రటి తెల్ల అడ్డచారల కొంగుని తలమీదగా కప్పుకున్న మరాఠీ గోచీకట్టు, కాళ్లకి బండ కడియాలు, బొటనవేలుకు పెద్ద మామిడిపిందె చుట్టు, చేతులకి మట్టిగాజులు, ముక్కుకి పెదవి పైదాకా పడే పుడక, చెవులకి రేడియో బ్యాసరలు, చెవి పైన ఒంపులకి బుగిడీ కడ్డీలు, లంగా లేని గోచీకట్టు చీర, సన్నటి నడుం