
KATHA-2023
₹140
In stock · 41 available
PublisherVASIREDDY NAVEEN
LanguageTelugu
మా మాట 'ఎంతెంత దూరం?' 'కోసెడు కోసెడు దూరం.' ఇది చిన్నప్పటి ఆటల్లో పాడుకొనే పాట. దూరం ఎప్పుడూ భారమే. గమ్యం చేరిందాకా అలసటే... సాహిత్యరంగంలో దూరాలు వేరు. ఇక్కడ గమ్యాలు లేవు. ఏది ఎప్పటికి చేరాలన్న, చేరుతామన్న నిర్దిష్టత లేదు. ప్రయాణం తప్పదు. పదే పదే (అడుగడుగునా) అలసటా తప్పదు. 35 ఏళ్లుగా ఎక్కడా ఆగని కథాసాహితి ప్రయాణంలో సంకల్పం ఉంది. ఉత్సాహశక్తీ ఉంది. అయితే ఈ క్రమంలో అలసటా ఉంది. అయినా ఇంకా ఇంకా ఇలానే సాగుతూ ఏళ్ల తరబడి వార్షిక సంకలనాలు తేవాలని కోరిక. ప్రస్తుత సంపాదకుల క్రియాశీల జీవితంలో మూడింట రెండు వంతులు ఈ సంపాదక బాధ్యతలతో గడిచిపోయింది. ఇది మాకు గొప్ప సంతృప్తి. ఈ సంతృప్తి చిరకాలం నిలబడటానికై కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్ష, ఈ ప్రయత్నంలో భాగంగా సహాయ సంపాదకుడుగా మా శ్రమలో పాలు పంచుకోవటానికి ముందుకు వచ్చిన ఎ.వి. రమణమూర్తిగారికి స్వాగతం పలుకుతున్నాం. నిజానికి దశాబ్దకాలంగా ఆయన మా పనిలో తోడుగా ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి మార్పుల ద్వారా వచ్చిన అనుభవంతో ఒక వ్యవస్థను ఏర్పరుచుకోవాలని భావిస్తున్నాం. * గత సంవత్సరంలాగానే ఈ ఏడు కూడా కథల ఎన్నికలో సమస్యని ఎదుర్కొన్నాం. వస్తురూపాల సమతుల్యత కథల్లో దెబ్బతింటోంది. కథలు ప్రచురించే పత్రికలు తగ్గడం వల్ల కథల రాశి కాస్త తగ్గిందిసరే, వాసి కూడా పల్చబడుతోంది. అయితే, కొత్తగా రాస్తున్న యువతరం రచయితలు భవిష్యత్తుకు కొంత ఆశాజనకంగా ఉన్నారు. ముందు ముందు వారి నుంచి మంచి కథలు ఆశించవచ్చు. వివిధ మాధ్యమాల్లో 2500కు పైగా వెలువడిన కథల నుంచి మేము ఉత్తమమైనవిగా భావించిన పదిహేను కథలివి. వీటి మంచిచెడ్డలను నిర్ణయించటం ఇక పాఠకుల. వంతు.