
KATHA CHANAKYA
₹250
Currently out of stock
PublisherJAICO PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789386867209
రాజు, ఋషి ? నృపతి, నృపతి నిర్మాత ? మనిషి, మర్మయోగి ? చంద్రగుప్త సార్వభౌముల ఆరాధ్య గురువు చాణక్యుల జీవితం నిగూఢము, వివేచనామయం. ఆయన మాటలు, చర్యలు అత్యంత అప్రమత్తతో యంత్రవతుగా కట్టుబడి, అమలు జరిగినవి. చాణక్యులు జీవితంలో పాఠాలను సోదాహరణంగా బోధించారు. చేయి తిరిగిన రచయిత రాధాకృష్ణన్ పిళ్లై ఈ అద్భుత పుస్తకంలో అక్షరాలా అదే చేశారు. 'కధ చాణక్య' ఘనయశస్వి ఆచార్యుల జీవితంలో నించి కధలు చెప్పి, భారతావని మహోత్తమ వ్యూహాశీలి, స్వాప్నికుల సిద్ధాంతాలను, ఆచరణలను ఆధునిక సందర్భాలకు అన్వయింప జేస్తుంది. ఈ కధలలో కొన్ని యదార్థాలు, మిగతావి కల్పితాలు. అది ఒక నాయకుడి ఎన్నిక అయినా, అవినీతిని రూపుమాపటం అయినా, ఘనవిరోధిని ఓడించటం అయినా అన్నీ ప్రజాసంక్షేమం దృష్ట్యా జరిగినవే. మీకు ఒక స్వప్నం, ఒక ధ్యేయం ఉంటే దానిని సాకారం చేయటంలో కధ - చాణక్య తోడ్పడుతుంది. రాధాకృష్ణన్ పిళ్లై ప్రఖ్యాత రచయిత. ఆయన రచనలు 'కార్పొరేట్ చాణక్య', 'చాణక్యాస్ 7 సీక్రెట్స్ టు లీడర్ షిప్', 'మీలోని చాణక్య', 'చాణక్య అలా చెప్పాడు', 'చాణక్య నీతి' అత్యుత్తమ అమ్మకాలు సాధించాయి. సంస్కృతంలో ఆయన మాస్టర్ డిగ్రీ పొందారు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఆయన పిహెచ్.డి సాధించారు. ఆయన పేరుపొందిన మేనేజ్మెంట్ సలహాదారులు, వక్త. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో చాణక్య ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిన్ స్టడీస్ (CIILS) విభాగానికి ఆయన డెప్యూటీ డైరెక్టర్. handle @rchanakyapillai ద్వారా ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇతర ముఖ్య సామాజిక మాధ్యమాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొంటారు.