
KATHAAVARANAM
₹145
In stock · 27 available
PublisherPENNETI PRACHURANALU
LanguageTelugu
కథ సింగమనేని నారాయణ గారికి ఇష్టమైన సాహితీ ప్రక్రియ. కథ ఎలా రాయాలీ, ఏ వస్తువులు కథలుగా రాణిస్తాయి, కథా ప్రయోజనం ఏమై ఉండాలి, కథలో ఔచిత్యం ఎలా పాటించాలి, సామాజిక ప్రయోజనం లేని కథలు ఎందుకు రాయకూడదు, కథలను రాణింప జేసే లక్షణాలేమిటి? ఇలాంటి అనేక విషయాలు ఈ వ్యాసాలను చదివితే లక్ష్య లక్షణ పూర్వకంగా పాఠకులకు అర్థమవుతాయి. పాఠకులు మంచి కథలను ఎలా చదివి అర్థం చేసుకుని ఆస్వాదించాలో నేర్చుకుంటారు. రచయితలు మంచి కథలు ఎలా రాయాలో నేర్చుకుంటారు. సింగమనేని సాహిత్యంలో వస్తువులోనే కాదు. శిల్పంలో కూడా వాస్తవికతే ప్రధానంగా ఉండాలని భావిస్తారు. పాఠకుడిని బోల్తా కొట్టించే మలుపులను, ప్రయోగాల పేరుతో పాఠకులకు వస్తువు అందకుండా అడ్డుకునే ప్రయోగాలను, పాఠకుడు ఊహించని మలుపులను, ఆయన నిర్ద్వందంగా తిరస్కరిస్తారు. అందుకే ఆయన "స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంటే మెలోడ్రామా లేకుండా వస్తువును ఆవిష్కరించవచ్చు” నంటారు (రాయలసీమ కథా చిత్రం). సిద్ధాంతాల కోసం రచన చెయ్యడాన్ని కొడవటిగంటి లాగే సింగమనేని కూడా వ్యతిరేకిస్తారు. రచయితలు సామాజిక మూలాలు తవ్వితీయాలి గాని, రచనలు సిద్ధాంతాలు వల్లించకూడ దంటారు... శిల్పమర్యాదాతిక్రమణను ఆమోదించని నిబద్ధ విమర్శకులు సింగమనేని. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి పెన్నేటి పబ్లికేషన్స్