
KATHALA ATTAIAH GARU-70
₹70
In stock · 1 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కథల అత్తయ్యగారు “ఎవరూ .. అమ్మాయీ ...” “ నేనేనండీ అత్తయ్యగారూ.” “దా కూచో, ఇప్పడే అనుకుంటున్నా, ఇంకా రాలేదేమా అని.” “ఈరోజు స్కూల్లో కొంచెం ఆలస్యంవయిందండీ. సత్యంమాస్టారు అన్ని లెక్కలు పూర్తి చేసి వెళ్లమన్నారు.” “కూచో. ఇవాళ ఏంకూర చెయ్యనా అని చూస్తున్నా,” అంటూ అత్తయ్యగారు మూలనున్న పీట నాముందుకి తోసారు.. అత్తయ్యగారు మడి కట్టుకు వంట చేస్తారు, నేను పొరపాటున తగుల్తానేమోనని ఆమె అనుకుంటారని నాకు తెలుసు. అంచేత పీట గోడవారకి జరుపుకుని ఒదిగి కూచున్నా. “అరిటికాయ వేపుడు చెయ్యండి. మామయ్యగారికిష్టం కదా” అన్నా. “అల్లం పచ్చిమిరపకాయా నూరి పెడతా. అల్లం పేగు శుద్ధి చేస్తుంది” అన్నారు అత్తయ్యగారు, కూరలబుట్టలోంచి రెండు అరిటికాయలూ, కత్తిపీటా ముందేసుకుని కూర్చుంటూ. నేను చూస్తూ కూచున్నాను. ”కథ చెప్పండి అత్తయ్యగారూ” అన్నాను కొంచెంసేపు ఆగి. “ఏంకథ చెప్పను?” “చిలకలకొలికి చిన్నదానా కథ పూర్తి చెయ్యలేదు కదండీ నిన్న.” “ఎంతవరకూ చెప్పానూ ...” అన్నారు అలవాటుగా దీర్ఘాలు తీస్తూ. “అదేనండి, పెద్దరాణికి ఒకమ్మాయి పుట్టింది. కాని చిన్నరాణికి అది ఇష్టంలేదు. అంచేత ఆ పాపని పుట్టినవెంటనే దాసీదానికి ఇచ్చేసి, పెద్దరాణితో 'నీకు కప్పపిల్ల పుట్టింది' అని చెప్పింది. పెద్దరాణి 'అయ్యో ఇది నాకర్మ' అనుకుని ఏడుస్తూ వూరుకుందిట. తరువాత చిన్నరాణికి కూడా ఒక అమ్మాయి పుట్టింది. ఇలా కొంతకాలం సాగింది. పెద్దరాణి కూతురు దాసీదానింటిలోనూ, చిన్నరాణికూతురు రాజుగారింటిలోనూ పెరుగుతున్నారు. చిన్నరాణి పెద్దమ్మాయిచేత దాసీపనులు చేయిస్తూ, చాలా కష్టాలు పెడుతూ వుంటుందిట. చిన్నమ్మాయికేమో, అదే ఆవిడ సొంతకూతురికి అది అస్సలు బాగుండదు..”