
KATHALU ANUVADA KATHALU
by SRI SRI
₹180
In stock · 543 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మహాకవి శ్రీశ్రీ “మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం” అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ ఏప్రిల్ 30వ, 1910లో విశాఖపట్టణంలో జన్మించారు. 1931లో బి.ఎ. పూర్తి చేసిన శ్రీ శ్రీ – ఎ.వి.యన్. కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా, మద్రాసు ఆంధ్రప్రభలో జర్నలిస్టుగా, లేబర్ ఎడిటర్ అసిస్టెంటుగా వివిధ ఉద్యోగాలు చేసినా, తనస్వంత భావాల కారణంగా దేనిలోనూ ఇమడలేక, సినీరంగంలో స్థిరపడ్డారు. తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ “మహాప్రస్థానం” 1950లో, “ఖడ్గసృష్టి” 1955లో ప్రచురితమై అభ్యుదయ రచయితల సంఘానికి ఆదర్శగ్రంథాలుగా పునర్వ్యవస్థాపించబడ్డాయి. అయన సాహితీ ప్రతిభకు గుర్తింపుగా “ఖడ్గసృష్టి” కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు. మహాకవి శ్రీశ్రీ – కథలు కూడా రాశారు అని ఆశ్చర్యపడేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీరి కథలు గతంలో ‘చరమరాత్రి’, **‘ఆరు ఎకరాలు’**గా వెలువడ్డాయి. ఇప్పుడు ఈ పుస్తకంలో శ్రీశ్రీ రాసిన సొంత కథలు, అనువాద కథలు ఉన్నాయి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీపించి, ఊగించి, శాసించి రగిలించిన మహాకవి శ్రీశ్రీ జూన్ 15, 1983లో మహాప్రస్థానమయ్యారు.