KATHALU GADHALU - 180 by DIGAVALLI VENKATA SHIVA RAO Telugu book cover

KATHALU GADHALU - 180

by DIGAVALLI VENKATA SHIVA RAO

₹180
In stock · 87 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. చిలకసముద్రం కలెక్టరు ఇది కచ్చిత కథ కాదు. నూరు సంవత్సరాలకు పూర్వం నిజంగా జరిగిన కథ. గంజాం జిల్లాలో ఇప్పటికీ ముసలివాళ్ళు ఈ కధ చెప్పుకుంటారు. చాలామంది పాశ్చాత్తు గుహకర్తలు దీనిని తమ పుస్తకాలలోకి యెక్కించారు. సదరు 'మేమో అనే పుస్తకంలో దీనిని గురించి ఒక ప్రకరణం వ్రాశారు వ్రాస్తూ వున్న గంజాం జిల్లాలో చిలకసముద్రం అనే మహాసరన్సు ఒకటి వున్నది. ఇది 44 మైళ్ళు పొడుగున బంగాళాఖాతానికి అనుకుని ఉన్నది. సముద్రానికి దీనికి 200 గజాలు వెడల్పు గల ఇసుకప మాత్రమే అర్థం ఇది సముద్రభాగమే అని చెప్పవచ్చును. డిశంబరు మంచి జూన్ వరకూ నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. వర్షాకాలంలో మాత్రం తియ్యగా ఉంటాయి. ఈ సరస్సు యొక్కలోతు మూడు మొదలు ఐదు అడుగులు ఉంటుంది. ఎక్కడా అజడుగులు దాటారు. దీనికి దక్షిణాన, పడమర, చిన్నచిన్న జాతికొండలు నీటిలోకి చొచ్చుకొని లంకల్లాగు ఉంటాయి. అలాంటి ప్రదేశాలలో ఒకదానికి బ్రేక్ఫాస్టు బలెండు (Break-last Island) అనిపేరు. ఈ సరస్సు మధ్య కళ్ళికోట రాజు గారి భవనం ఒకటి ఉన్నది. ఇండియా దేశానికి వైస్రాయిగా వుండిన కర్ణసుప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడు "ఈ చోటునుంచి కనబడే దృశ్యం భారతదేశంలోనికల్లా సుందరమైనదిగా నాకు తోస్తూంది" అని అన్నాడట! మన కథ ఈ ప్రదేశానికి సంబంధించినదే! మన కథానాయకుడి పేరు తామస్ సాస్, ఇతను గేబ్రిల్ స్నాప్గ్రేసు కొడుకు. ఇతడు 1759 లో జన్మించాడు. తండ్రి ఇండియాలో కుంపిణీవారి కొలువులో పనిచేశాడు. అతని ప్రాపకంవల్ల తామసుకు కూడా 1777 లో చెన్నపట్నం సెంట్ జార్జికోట పరిపాలన క్రింద ఒక రైటరుగిరీ (Writer-ship) యిచ్చారు. 1782 లో ఈ కుర్రవాడికి ఫ్యాక్టరు (Factor) గా ప్రమోషను యిచ్చారు. 1790లో ఇతడు సీనియరు మర్చెంటు హోదాను, గంజాం అసిస్టెంటు రెసిడెంటు పదవిని పొందినాడు. భారతదేశంలో ఎక్కడ చూసినా వరహాల చెట్లు వుండిన రోజులు - అవి. ఆ చెట్లను ఆశ్రయించుకొని దులిపినకొద్దీ బంగారు వర్షం కురిసేది. తక్కిన దొరలలాగునే ఈ స్నాడ్రసుకూడా ఉద్యోగరీత్యా తనకు అబ్బిన అవకాశాన్ని వృథా పోనివ్వకుండా ఆ వరహాల చెట్టును గట్టిగా పట్టుకొని దులపడం ప్రారంభించాడు. ఇతడు రెసిడెంటుగా వచ్చిన రెండు సంవత్సరాలలో గంజాంలో కఱువు వచ్చింది. ఈ కఱువులో ఇతడు తెలివిగా పనిచేశాడు, జమీందార్లను అదుపులో వుంచాడు. ఆ కాలంలో ఇతడు తిండిలేక మాడుతున్న వాళ్లచేత పనులు చేయించి సర్కారు డబ్బులతో వారికి గంజికూడు పెట్టించాడు. ఇతడు వాళ్లచేత కట్టించిన బిల్డింగులలో గంజాం పట్టణానికి పదిమైళ్ళలోవున్న రంభలో చిలకసముద్రంయొక్క ఒడ్డును ఆనుకొని ఇరవైవేల నవరసులు పెట్టి కట్టిన సుందరమైన భవంతి ఒకటి. ఇది అతని సొంతం. కథలు - గాథలు