
KATHAVAHINI 2013
₹180
In stock · 10 available
PublisherVAHINI BOOK TRUST
LanguageTelugu
ISBN9788192800011
కథావాహిని - 2013 తారాదేవి కన్నీరు జలంధర కొన్ని క్షణాలు.... జీవితంలో అనుకోని మలుపు తెస్తాయి. మనకు తెలియకుండానే రోలర్ కోస్టర్ రైడ్లో పడిపోతాము. కొన్ని ఆలోచనలు మన జీవితపు సరళిని మార్చావేస్తాయి.... అప్పటిదాకా గుర్తించని అంతఃకవాటాలు తెరుచుకుంటాయి. కొన్ని సంఘటనలు.... మనం ఎందుకు పుట్టామో.... ఈ మహా విశ్వంలో మన ఉనికి గుర్తింపు ఎంతో తెలియచెబుతాయి. అంతే.... ఆ తరవాత జీవితం మామూలుగా ఉండదు. అట్లాంటి అనుభవమే జరిగింది చైతన్యకు. ఎయిర్పోర్ట్లో కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు చైతన్య. గొప్ప బిజినెస్ మాన్ అతను.... ఎక్కడ లాభమున్నదో అక్కడ బిజినెస్ ఓపెన్ చెయ్యగలి గిన సమర్ధత అతనికి ఉన్నది. కొన్ని లక్షల డాలర్ల టర్న్ఓవర్ ఉన్న అతనికి ఈ మధ్య కాలంలో ఉలికిపాటు తప్పడం లేదు. ప్రపంచపు ఆర్థిక స్థితి అతని ప్రణాళికలను దెబ్బతీస్తోంది. కొంతమంది ఆహారం తోనూ, కొన్ని దేశాలు స్వార్ధంతోనూ తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తాయని, సామాన్యుణ్ణి నిస్సహాయుణ్ణి చేసేస్తా యని తెలియనవాడు కాడు అతను. మరి అతనూ సామాన్యుడు కాడు. ఎవరో తన జీవితాన్ని కొత్త చట్టాలతో శాసించడానికి ఒప్పుకునే రకం కాదు.... ఎవరో తెచ్చిపెట్టే వినాశనాన్ని మామూలు మనిషిలా భరించడానికి సిద్ధంగా లేడు అతను. అతని గొప్ప బిజినెస్ వెనకాల చాలా అప్పు ఉన్నది. లాయర్ నోటీసులు ఉన్నాయి. చట్టపరం కాని వ్యవహారాలు చాలా ఉన్నాయి. కానీ, ఇవన్నీ బిజినెస్మన్కు తప్పని వ్యవస్థలో ఉన్నాము మనం.