KAVI PADHUSHA PUVVADA KAVITVAMU VYAKITVAM by PUVVADA THIKKANA SOMAYAJI Telugu book cover

KAVI PADHUSHA PUVVADA KAVITVAMU VYAKITVAM

by PUVVADA THIKKANA SOMAYAJI

₹250
In stock · 49 available
PublisherPUVVADA THIKKANA SOMAYAJI
LanguageTelugu
వాడని పువ్వు - పువ్వాడ వారి సాహిత్యం డా. మండలి బుద్ధప్రసాద్ మహాకవి క్షేత్రయ పదపారిజాత పరిమళాలు గుబాళించిన మొవ్వ గ్రామంలో జన్మించి ఆధునికాంధ్ర సాహిత్య ప్రపంచాన్ని కావ్య పరిమళాలతో శోభింపజేసిన పూజ్యులు, పెద్దలు కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరిరావుగారు. వారిది పండిత వంశం. వారి తాతగారు పువ్వాడ శ్రీరామదాసుగారు తమ భక్తి కీర్తనలతో సంకీర్తనా ప్రపంచాన్ని మొవ్వగ్రామం నుండి మరొకసారి శోభాయమానం చేశారు. 'కవిపాదుషా' పువ్వాడ శేషగిరిరావుగారి ప్రియతమ శిష్యుడు మా నాన్నగారు మండలి వెంకటకృష్ణారావుగారు. పువ్వాడవారు బందరు హిందూ కళాశాలలో మా నాన్నగారికి ప్రత్యక్ష గురువు. వారిద్దరి గురుశిష్యానుబంధం వారున్నంత వరకు వాడని పువ్వుగా వర్ధిల్లింది. మా నాన్నగారికి విద్యార్థి దశలో భాషా సాహిత్యాలపట్ల, తెలుగు సంస్కృతి పట్ల అభిరుచి కల్పించి భవిష్యత్తులో అపూర్వంగా, ఆశ్చర్యకరంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలన్న సంకల్పానికి బీజావాపన చేసింది పువ్వాడ వారని చెప్పవచ్చు. వారి ప్రభావం విద్యార్థి దశలో లేకపోతే మా నాన్నగారు భాషాభిమానంతో భాషా సాహిత్యాభివృద్ధికి కృషి చేసి ఉండేవారు కారేమో, ఉత్తమ అధ్యాపకులుగా పాఠాలు చెప్పటమే కాక ఉత్తమోత్తమ గురువుగా విద్యార్థులపై తన ప్రభావాన్ని ప్రసరింపజేయటం పువ్వాడ వారి గురుత్వజయకేతనం.