
KAVISENA MANIFESTO
₹300
In stock · 2 available
PublisherG.SAATYAKI
LanguageTelugu
కవిసేన మేనిఫెస్టో ఏ విషయంమీదనైనా రాయండి. కానీ ఆ రాసింది కవిత్వం అన్నది ప్రమాణీకరించుకోండి అంటున్న ఈ పుస్తకంలో స్పష్టంగా కనపడేది శాస్త్రవిధేయత. తను అంటున్న ప్రతిదానికి ప్రమాణకంగా గొప్ప గ్రంథాన్నో విమర్శకుల పలుకులనో శాస్త్రజ్ఞుల సిద్ధాంతాలనో చూపిస్తూ ఉండటం ఈ కవి ప్రత్యేకత. కేవలం చెప్పటమే కాక, పూర్వాపరాలు స్పష్టంగా చిత్రీకరిస్తూ తన సిద్దాంతాలకు భాష్యం చెప్పుకు పోవడం ఈ కవి గొప్పతనం. అసలు ప్రక్రియే దేనికైనా ప్రాణమని ఆకర్షించడానికి ప్రక్రియను అసరాగా చేసుకొని, సార్వజనీన శ్రేయస్సు అనే ప్రయోజనాన్ని పొందాలి అనేదే ఈ కవి ద్వారా కవిసేన చేస్తున్న ఉపదేశం..... సమగ్ర మానవ జీవితంలో ఒక భాగమైన రాజకీయాలకు లొంగిపోయి, కవిత్వం మరచిపోయి, నినాదాల్ని ఎడాపెడా కవిత్వం పేరుతో చలామణీ చేస్తున్న కవికి - కొరడా దెబ్బలీ పుస్తకంలో హితవులు. దేశానికి నాయకత్వం వహించాల్సిన కవి, రాజకీయ భవనాల్లో పెంపుడు కుక్కగా బ్రతకడాన్ని నిరసిస్తూ తనకున్న ఆయుధాలను గమనించి, వాటికున్న చైతన్యాన్ని గుర్తించి సరిగ్గా ప్రయోగించి వైజ్ఞానిక నాయకత్వాన్ని దేశానికి ప్రసాదించాల్సిన బాధ్యత కవికి ఉందని చెప్పే మేనిఫెస్టో අයි. ఈనాడు దినపత్రిక, 5-11-1978 ఈ ‘ఆధునిక కావ్యశాస్త్రమ్'లో కొన్ని విలువైన తలంపులున్నాయి. వాటిని పొందగోరిన వారు తేనెతుట్టెలో తేనెటీగల్ని తోలి తేనెను తీసుకున్నట్లుగా శ్రమపడి తీసుకోవాలి. కవితాశిల్పమెలా ఉండాలో ఈ కావ్యశాస్త్రంలో "కవిత్వం శబ్ద శిల్పమా?" అనే ప్రకరణంలో విపులంగా చర్చించారు..... శిల్పంలేని రచన ఎంత పేలవమో వివరిస్తూ అర్థదోషాలు పద్దెనిమిదింటిలో నిరలంకృతి అనే ఒక దోషాన్ని చెప్పడం గురించి ఆలోచనాత్మకమైన చర్చ చేశారు... ఈ పుస్తకంలో ప్రాక్పశ్చిమ భేదం లేకుండా విశ్వవ్యాప్తులైన కవుల రసవత్ కావ్య ఖండికలను, కవితా సిద్ధాంతాలను చర్చించడం ఆసక్తిదాయకంగా కనిపిస్తుంది.... సహృదయులీ గ్రంథం చదవకపోతే తెలుగు సాహిత్యానికి సంబంధించిన చాలా విలువైన విషయాలను తెలుసుకోకపోవటమవుతుందని మాత్రం చెప్పగలను. ఆంధ్రప్రభ దినపత్రిక, 1-10-1978 దాదాపు 40 ఏళ్ల క్రితం మొదటిసారి అచ్చయినపుడు చాలా చర్చను రేకెత్తించిన పుస్తకం ఇది. ఆ చర్చ సంగతెలా ఉన్నా కవిత్వాన్ని ప్రేమించే వాళ్లకు, అకవిత్వాన్ని తిట్టుకునే వాళ్లకు పనికొచ్చే కొటేషన్లు ఇందులో అనేకం ఉన్నాయి. మచ్చుకి ఒకటి - 'ప్రతి కవితా ఎలా ఉండాలి? జయదేవుడు చెప్పిన ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. ఒక మారణాస్త్రంలా ఉండాలి. పట్టుకుంటే చస్తామేమో అనే భయం కలిగించాలి. చదివి పాఠకుడు చావాలి. కొత్త జన్మ ఎత్తాలి, అది పరమార్థం' - కవిత్వం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో సుదీర్ఘంగా చర్చిస్తూ అనేక ప్రామాణిక గ్రంథాలను, కవులను ఉటంకిస్తూ శేషేంద్ర శర్మ చేసిన బృహత్ రచన ఇది.