KAVITHA O KAVITHA! VASTHUVU BASHA SHAILI by MADABUSHI SAMPATH KUMAR Telugu book cover

KAVITHA O KAVITHA! VASTHUVU BASHA SHAILI

by MADABUSHI SAMPATH KUMAR

₹25
In stock · 187 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
శ్రీశ్రీని చదువుకుందాం ...రండి! ఎలా? ఇలా... ఇదోమార్గం. నేటి తరం సాహితీ వేత్తలు శ్రీశ్రీ గురించి అంచనా వెయ్యడానికి పూనుకొంటున్నారు. శ్రీశ్రీకి ముందు తరం "ప.. ఆ"... అన్నారు. శ్రీశ్రీ రచనా కాలంనాటికి ప్రసిద్ధులైన సమకాలికులు "ఆహాఁ! చూద్దాం" అని ఉండచ్చు. శ్రీశ్రీ రచనా కాలం సమకాలికులు "ఆహా..ఓహో" అన్నారు. ఆ తరవాతి యువరచయితలు తమ కాదర్శం శ్రీశ్రీ అనుకున్నారు. సమకాలిక సాంప్రదాయ వాదులు "చూద్దాం, ఎంతకాలం ఈ కనీ, కవితా గుర్తుంటుందో!?" అంటూ శకునాలకోసం ఎదురుచూసినా తెలుగువాళ్ళు మాత్రం శ్రీశ్రీకి శతజయంతి తమ శక్తికొద్దీ జరుపుకొని అభ్యుదయ సాహితికి నీరాజనం పట్టారు. ఇక ఈతరం అంటే శ్రీశ్రీ తరువాత రచనలు చేపట్టిన యువతరం నవతరం శ్రీశ్రీ సాహితిని మూల్యాంకనం వెయ్యడానికి సిద్ధమవుతున్నారు. శ్రీశ్రీని అధ్యయనం చేయడానికీ, విమర్శించడానికీ, పరామర్శించడానికీ, వింగడించడానికీ, విశ్లేషించడానికీ అనేక సదుపాయాలూ సమాలోచనాగ్రంథాలు - ఉపకరణాలూ వీరికి అందుబాటులో ఉన్నాయి. శ్రీశ్రీ కాలంవరకూ ఉన్న విమర్శకులకు అట్టొచ్చిన ఓ అంశం... ఈతరం వారికి ఆటంకం కాబోవకపోవడం ఓప్లస్ పాయింట్ అదే మొహమాటం, శ్రీశ్రీని ఏవన్నాఅంటే ఆయనతోబాటు ఇతరులూ ఏమనుకుంటారో నన్న అనవసర భయం. శ్రీశ్రీ సాహిత్యం జాతిజనులు పాడుకొనేలా ఎందుకుందో! తరాలు గడిచినా నవచేతనంగా యుగశక్తిగా స్ఫూర్తి నెందుకిస్తోందో!? తెలుసుకోడానికి ఈ తరం వాళ్ళకెన్నో ఆకరాలూ, అందొచ్చిన ప్రముఖుల అంచనాలూ పని కొస్తూన్నాయి. తనసాహితీసృజనకు పునాదిగా ఎంచుకొన్న తాత్వికత బలం వల్లా, తానెంచుకొన్న వస్తువుకున్న శక్తి వల్లా -ఆ వస్తువును వ్యక్తీకరించేందు కెంచుకొన్న జాతి జీవనాడుల్లోని ప్రతీకలూ వాటికేసిన జనం మాటల గుండెచప్పుళ్లూ దుస్తులవల్నా ఎందువల్న అన్న అంశాలు తేల్చటం ఈ తరం నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతో, ఓ పరిశోధక తాదాత్మ్యంతో నెరవేర్చ గల్గుతున్నారు. ప్రతి కవిత కోకథ ఉండే ఉంటుంది. దీని వెనక ఓ చారిత్రక సామాజిక అంశాలతో పాటు ప్రేరణ కల్గించటానికి కవి వ్యక్తిగత స్పందనా ఉండే తీరుతుంది. ప్రతి కవితను ఎలా చదవాలో - అధ్యయనం ఎలా చేస్తే కవికి దగ్గరగా వెళ్ళినట్టవుతుందో చెప్పడానికి ఇలాంటి చిన్న చిన్న కరదీపికలు అవసరమవుతాయి. ఆ దిశలో 'కవితా ఓ కవితా' అన్న ఖండిక శ్రీశ్రీ దృష్టిలో (కవిత్వాన్ని విశదీకరించిన మేనిఫేస్టో.... ఈ కోణం మరింత పదును పెట్టుకోండంటూ నేటి పాఠకులకు మిత్రుడు సంపత్కుమార్ ఈ అకాడమిక్ ఆకురాయి అందిస్తున్నాడు. అందుకుందాం... ఆహ్వానిద్దాం... శ్రీశ్రీకి మరింత దగ్గరగా జరిగి చదువుకుందాం.