
KAVITVA DEEPA SIKHA SIKHAMANI KAVITVAM PAI VISLESHANA
by KONDREDDY VENKATESWARA REDDY
₹100
In stock · 55 available
PublisherKAVISANDHYA GRANDHAMALA
LanguageTelugu
1. ఉపోద్ఘాతం అభ్యుదయ సానువుల్లో ఆధునికతను మనిషి తనాన్ని సార్వజనీనమైన స్థాయిలో అవలోకిస్తూ, అంతఃకరణ శుద్ధితో, చైతన్య దీప్తితో, శాస్త్రీయ దృక్పథంతో, సహేతుకమైన దృష్టితో నిర్దిష్టమైన ధ్యేయంతో, స్పష్టమైన లక్ష్యంతో కాలం కదలికలకు కంటి చూపునంటించి కలం కదుపుతున్న అక్షరయోధుడు, విద్వత్లల కవితామణి శిఖామణి. అనుక్షణం అలుపెరుగని జలపాతంలా, నిరంతరాయంగా నిరాడంబరంగా, నిర్మోహ మాట భావావేశ కొరడాను ఝళిపిస్తూ వినీల కావ్యాకాశమంతటా అరుణారుణ ప్రభలతో నీలోత్పల వెలుగులతో అమోఘమైన లోకానుభవసారాన్ని అక్షరంగా ఆవిష్కరించిన అద్వితీయమైన కవి శిఖామణి. సామాజిక అపసవ్య కదలికలను అస్తిత్వ వేదనలను, అనైతిక వాదనలను, వో సైద్ధాంతిక దృక్పథంతో, నిశిత పరిశీలనతో, నియమ నిష్ఠతో అవగాహనించుకుంటూ, సృజనాత్మకతకు చుక్కానై నిత్య నూతనత్వానికి చేవ్రాలై సాగిపోతున్న కవీయన. అణగారిన వర్గాల్లో అభ్యున్నతి కాంక్షిస్తూ అక్షర తపస్సులోంచి ఉజ్జ్వల ఉషస్సులు వెదజల్లుతూ ఉద్యమస్ఫూర్తికి అక్షరాయుధాల్ని అందిస్తున్న ప్రగతిశీల ప్రజాస్వామిక భావనా పటిమకు బాసట ఈయన కవిత్వం. చిడిముడి బాల్యాన్ని, తడబడు కౌమార్యాన్ని, యాతనామయమైన యౌవనాన్ని ఎన్నో వత్తిళ్ళమధ్య నలిగిన నడివయస్సును, అవలోకించిన అనుభవసారాన్ని, ఆత్మవేదనా భారాన్ని అక్షరదొన్నెల్లో దట్టించి రస ప్రవాహంలో ఓలలాడించి ఆత్మస్థైర్యాన్ని బొమ్మకట్టించిన కవీయన. వస్తు విస్తృతి, సమయస్ఫూర్తి, లోతైన విషయ పరిజ్ఞానం, పాఠక హృదయాల్ని ముట్టడించే అభివ్యక్తి ఈయన కవిత్వంలో కనిపించే విశేషాంశాలు. వీరి కవిత్వం కేవలం వ్యక్తిగతమయిన భాషా ప్రయోగ వ్యాయామమే కాదు, వ్యవస్థాగతమైన విధ్వంసక చర్యల మధ్య నిరంతరం తనను తాను వెతుక్కుంటూ తనదైన ముద్రతో పాఠక హృదయాల్లోని ఆలోచనా దొంతర్లను కుదిపి, సరికొత్త ఆలోచనలకు పదునుపెట్టే పనితనమేదో నిగూఢ శక్తిగా తాకి పలకరిస్తుంటూంది. వర్తమాన సమాజం గుండెకు చెవి ఆనించి వింటే వినపడే ఆధిపత్య వర్గాల దోపిడి