KEELLA VYADHULU SULABHA NIVARANA by SREE MADHULATHA PUBLICATIONS Telugu book cover

KEELLA VYADHULU SULABHA NIVARANA

by SREE MADHULATHA PUBLICATIONS

₹50
In stock · 8 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ముందుమాట "నీకు నొప్పి కావాలా....? వట్టి శూన్యం కావాలా...??" అని అడిగితే నొప్పినే కోరుకొంటాను విలియం ఫాక్నర్ మనలో 'నొప్పి' అంటే ఏమిటో తెలియని వారుండరు. మనుషులందరికీ నొప్పి సహజం. నొప్పి విశ్వవ్యాపిత జీవితం అనే అగ్ని పర్వతంలోపల "లావా"లా అంతర్లీనంగా నొప్పి ప్రవహిస్తూనే వుంటుంది. ఆ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా ప్రవాహం ముంచెత్తుతుంది. విజ్ఞులు, మేథావులు, ఆలోచనాపరులు, యుక్తయుక్త విచక్షణ కలవారూ తమలో దాగిన నొప్పి "లావా"ని పెల్లుబికి రాకుండా నియంత్రించుకోగలుగుతారు. అవును! ఊటబావిలోంచి నీళ్ళు ఊరినట్లు శరీరంలో ఏదో ఒక భాగంలోంచి నొప్పి ఊరుతూనే వుంటుంది. అలాంటి శరీరతత్వాన్ని కీళ్ళవాతం (రూమాటిక్ వ్యాధి) త్వరగా సోకే అవకాశాలు వుంటాయి. రూమాటిక్ నొప్పులు కలిగే శరీర తత్వాన్ని వాత శరీర తత్త్వం అంటారు. వాత శరీరం వున్న వారిలో త్వరగా రూమాటిక్ వ్యాధులు రావడం, వచ్చినవి త్వరగా శరీరం అంతా వ్యాపించడం, ఎక్కువ బాధ పెట్టడం, ఎక్కువ ఉపద్రవాలు ముంచుకు రావడం జరుగుతూ వుంటాయి. అందుకే, నొప్పులు తరచూ వచ్చే వ్యక్తులు తప్పకుండా తమ శరీర తత్వాల్ని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. ఆ విధంగా కీళ్ళవాతం పట్ల అవగాహన కల్గించేందుకోసం ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడేలా వుండాలని నా ఆకాంక్ష. నొప్పి తీవ్రతని రోగి తగిన మాటలతో వ్యక్తపరచగలడేగాని, గ్రాముల్లోనూ, లీటర్లలోనూ (లేదా) మరో యూనిట్లలోనూ కొలిచి చెప్పలేడు కదా... "చెయ్యి చెరుకురసం మిషన్లో పెట్టిన ట్లు నములుకు పోతోంది", "వెన్నులో ఎవరో కత్తితో పొడిచినట్లు బాధగా వుంది", "అరికాళ్ళు నిప్పుల మీద నిలబడినట్లు మండిపోతున్నాయి", "కడుపులో అగ్నిగుండం రగిలినట్లు భుగభుగలాడి పోతోంది" ఇలాంటి భావాల్లో బాధని వ్యక్తీకరించినప్పుడు రోగిపడ్తున్న అవస్థ ఎలాంటిదో మనకు తేలికగా అర్ధం అవుతుంది. అంత బాధ ఎందుకొచ్చింది? శరీరంలో ఎక్కడో ఏదో తేడా ఏర్పడినప్పుడు, ఇలా తేడా ఏర్పడిందని శరీరం హెచ్చరించడానికే “నొప్పి" వస్తోంది అంటుంది శాస్త్రం. ఇది ఆత్మరక్షణ (Self-preservation) కోసం శరీరం ప్రయోగిస్తున్న ఒక ఆయుధం “నొప్పి”. దీన్ని ఇలాగే అర్థం చేసుకుందాం! ໑໖ "BUILT-IN-WARMING SYSTEM". నిజానికి ఈ నొప్పే కలగకపోతే, గుండె లోపల ప్రమాదకర మార్పులొచ్చి హార్ట్టాక్ ఏర్పడి ప్రాణాపాయ స్థితి కలుగుతోందని మనకు ఎలా తెలుస్తుంది?