KILADI DEYYALU - 75 by G.V.L.NARASIMHARAO Telugu book cover

KILADI DEYYALU - 75

by G.V.L.NARASIMHARAO

₹75
In stock · 868 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కిలాడి దెయ్యాలు "దెయ్యాల పుటకల్లో గొప్ప రగస్యాలు ఉంటాయి తెలుసా" అన్నాడు ఎంకటి. "చచ్చినోళ్లు గదా దెయ్యాలు అయ్యేది. నువ్వేంటి పుటక లంటావు." అడి మాట తీసి పారేసింది చెంద్రి. "అది అంతేలే. ఎట్టాగో చెబుతా యిను" అన్నాడు ఎంకటి. నానుడు వాన పడతా ఉంది. ఇద్దరూ పాక సావిడిలో కూచుని ఉన్నారు. చెంద్రి ఇష్టంగా మొగుడుకు దగ్గరగా చేరింది. మోకాళ్ల చుట్టూ పవిటి చుట్టి ముడుచుకు కూచుంది. ఎంకటి మొద లెట్టాడు. "మా జిల్లాలో జంగాలపల్లి అని ఉంది. దాని సుట్టూ నా ఊళ్లు ఉన్నాయి. అన్నీ బాగా దగ్గర దగ్గర. ఈ ఊళ్లో కోడి కూసింది అంటే చాలు. ఆ ఊరులో తెల్లారుతుంది. "ఆ ఊరులో ఎవడన్నా పులి అన్నా డనుకో. ఈ ఊరులో వాళ్లు అదిగో తోక అంటారు. అలా ఉంటారు మా మూక. "ఉన్నట్టుండి మొన్నీ మద్దె ఆ ఊళ్లన్నీ పుకారులతో అట్టుడికిపోయాయి.. ఎంకటి చటుక్కున ఆపు చేశాడు- 'ఉండేహె! సక్కగా కూసుని యిన లేవూ' అని కోప్పడి పక్కకు జరిగాడు. చెంద్రి మూతి విరిచి 'సెప్పు' అంది. ఎంకటి మళ్లా అందుకున్నాడు. “అట్టా పుకారులతో అట్టుడిగి పోతన్నాయా... అయ్యన్నీ దెయ్యాల గురించే, దెయ్యాలూ పిశాచాలు ఊళ్ల మీద పడతన్నాయి. ఆడాళ్లను మరీ ఆగం ఆగం చేస్తన్నాయి. "లింగాల పల్లిలో మొన్న ముగ్గురు ఆడాళ్లను సెరిశాయి. వాళ్లు సావు బతుకుల్లో ఉన్నారింకా. ఆ ఊళ్లో నూకాలమ్మ తల్లి గుడి తలుపులు కూడా మూసుకుపోయాయి. పాపం. ఆ తల్లీ ఆడదే నాయే. "ఆ పక్క ఊరు బొగ్గారం ఇద్దరు రైతులు దెయ్యాలను సూశారు. అక్కడి కక్కడ నెత్తురు కక్కుకు చ్చారు. "జగ్గారంలో అయితే ఏడడుగుల ఎత్తు పిశాసిని డాక్టరమ్మ సూసింది. అంతే. యిరుసుకు పడి యింది. ఇంకా తెలివిలోకే రాలేదు. వదు. "ఇట్టా ఊరుకో దెయ్యం రోజుకో పుకారు- సికారు చేస్తా ఉండాయి. ఇవి ఎక్కడ పుడుతున్నాయో