KITABU KAVITHA SAMPUTI by K.TEJASWINI Telugu book cover

KITABU KAVITHA SAMPUTI

by K.TEJASWINI

₹100
In stock · 192 available
PublisherK.TEJASWINI
LanguageTelugu
ISBN9789391400880
చినుకు ఎంత పదునైనదనుకున్నారు? నింగి నుండి పడినప్పుడల్లా గుండె గాయాన్ని గునపంలా రేపే శక్తి ఉంది దానికి. కంటి నుండి జారినప్పుడు గతమంతా తోడేసి గుండె వాకిళ్ళు శుభ్రంగా కడిగేయగలదు. ఈ చినుకులన్నిటిని అక్షరాలుగా మలుచుకుని గుండె గుమ్మానికి తోరణాలు కట్టుకున్న క్షణం మనసుకి పండగే. ఆ నిజాన్ని తెలుసుకున్నవారు అక్షరాలను, ఆ క్షణాలను జీవితానికి కితాబులుగా భావించి పదిలంగా భద్రపరుచుకుంటారు. ఒక్కోసారి అవి పుస్తకాలలో నెమలి ఈకలుగానో, బతుకు పుటలలో మరుగునపడిన పువ్వులుగానో రూపాంతరం చెందుతాయి. పాత తొవ్వలలో ప్రయాణపు ఊతతో కొత్త పుంతలు తొక్కేందుకు ఉవ్విళ్ళూరే మనసు జీవితానికి మనం తిరిగిచ్చే కితాబు.