
KOLLAYI GATTITE NEMI
₹250
In stock · 152 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
kollayi gattite nemi by mahidhara rama mohana rao ఆంధ్రదేశ చరిత్రలోనే 1920-45ల పాతికేళ్ళకు అనిదంపూర్వమైన ప్రాముఖ్యం వుంది. సామాజికంగా వీరేశలింగం ప్రభృతులు సంస్కరణవాద ధోరణులతో జాతి సంస్కారాన్ని ఎన్నో మెట్లెక్కించిన కాలం అది. సహాయ నిరాకరణం, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు జాతిని అపారత్యాగాలకు సంసిద్ధం చేసిన కాలం అది. సాహితి, నవ్యసాహితి, అభ్యుదయోద్యమాలు సాంస్కృతిక రంగాన్ని నూతన స్థాయికి చేర్చిన కాలం అది. ఫాసిజం, నాజీజం విజృంభించి రెండో ప్రపంచ యుద్ధాన్ని, ప్రపంచాన్ని జయించబోయి సోషలిస్టుసేనల చేతిలో నేల కరిచిన కాలం అది. తెలుగు ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్ర శాస్త్రీయమైన అవగాహనతో అన్ని వైపుల నుంచి అధ్యయనం చేసి, కళాత్మకత దెబ్బతినకుండా 'కొల్లాయిగట్టితేనేమి?', 'దేశం కోసం', 'జ్వాలాతోరణం', 'రథ చక్రాలు' అనే చారిత్రక నవలలు మహీధర రామమోహనరావు రాశారు. కాంగ్రెసు, కాంగ్రెసు సోషలిస్టు, ఫార్వర్డుబ్లాకు, రాయిస్టు, కమ్యూనిస్టు పార్టీలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ, అన్నీ కలిసి పరాయి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ, సంక్లిష్ట చారిత్రక గతితో మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల్ని సజీవరీతిలో చిత్రించిన నవలలు ఇవి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్ర బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004