
KOLLETI JADALU
₹100
In stock · 56 available
PublisherSWECHA PRACHURANALU
LanguageTelugu
'కొల్లేటి జాడలు' (పర్యావరణ చిత్రం) కథ, మాటలు, ఛాయాగ్రహణం, దర్శకత్వం అక్కినేని కుటుంబరావు నిజమే అది. కుటుంబరావు గారి 'కొల్లేటి జాడలు' నవల చదువుతున్నంతసేపూ, ముగించిన తరువాతా కూడా కళ్లనిండా అవే దృశ్యాలు. చదివి మనం ఊహించుకునేవి కావు. రచయిత దర్శకుడు ప్రతీ దృశ్యాన్ని తన ఏంగిల్ లో కెమెరా నిలబెట్టి చిత్రానువాదాన్ని మనకి చూపిస్తున్నారు. ఈ నవలలో కనిపించే పిక్టోరియల్ క్వాలిటీ దాని ప్రధాన ఆకర్షణ. కుటుంబరావుగారు సినిమాలు తీశారు. ఆ మాధ్యమం పట్ల ఆయనకి గాఢమైన ఆసక్తి ఉంది. అందుకే ఆ దృశ్య విభజన, దృశ్యమాలిక మనకి ప్రత్యక్షమై దోనెలో కూచుని కొల్లేటిలో తిరుగుతున్న అనుభూతిని కలగచేస్తున్నాయి. మంచి సినిమా చూసిన కొన్ని రోజుల వరకూ ఆ దృశ్యాలు మనలోనే ఉంటాయి. ఈ నవల ముగించిన కొన్ని రోజుల వరకూ కొల్లేటి దృశ్యాలు మనసుని కమ్ముకుంటాయి. కమ్ముకోవడం ఎందుకంటే కొల్లేరు ఒక జీవావరణ, జీవన, పాలనాపరమైన విషాదం ఇప్పుడు. కొల్లేటి నేపథ్యంలో చాలా తక్కువ కథలు వచ్చాయి. వచ్చినవి కూడా పట్టించుకోవలసినవి కావు. ఆ దృష్ట్యా ఇది మొదటి నవల. ఒక రకంగా ఇది పర్యావరణ నవల. కానీ నవల నేపథ్యం ఈ నాటిది కాదు. ఈనాటిదే అయితే కొంచెం చల్లారిన కాఫీలా ఉండేదనుకుంటాను. కారణం వర్తమాన పరిస్థితి అందరికీ తెలిసిందే. పత్రికల్లో చూస్తున్నదే. డబ్బు, పలుకుబడీ, ఉన్నవాళ్లు వనరుల్ని దోచుకోవడం మనకి కొత్తగాదు. వాళ్లందరికీ వ్యవస్థ అండదండలుంటాయి. కుటుంబరావుగారు కథని 1950 ప్రాంతాల్లో నడిపించారు. దాని వల్ల ఇప్పుడు