KOMURAM BHEEM - 60.00 by BHUPAL Telugu book cover

KOMURAM BHEEM - 60.00

by BHUPAL

₹60
In stock · 772 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కొమురం భీం ఒక ఆదివాసి వీరుడి పిల్లల నవల- బొమ్మలతో • పూర్వం 16వ శతాబ్దంలో బీజాపూర్ రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు అలీ అహమ్మఢ్పా. అతను తన తండ్రి తర్వాత ఇరవై రెండు సంవత్సరాలు రాజ్యమేలివాడు. ఇరవై మూడో ఏట ఎవరో శత్రువులు కుట్రపన్ని అతన్ని హత్య చేశారు. హత్య గావించబడిన వాటికి అతనికి తొమ్మిది ఏండ్ల కొడుకు ఉన్నారు. అతని పేరు ఇబ్రహీం ఆదిల్షా. అప్పట్లో రాజు కొడుకే మళ్లీ రాజు కావాలన్న నియమం ఉండేది. కానీ, తొమ్మిది ఏండ్ల పిల్లవాడు రాజు ఏలడం కష్టం గదా!! ఐతే తండ్రి అలీ అహమ్మ¿ కొలువులో ఆర్థికమంత్రి ఒకరున్నారు. అతను మహారాష్ట్ర బ్రాహ్మణుడు. ఆయన ఈ రాజ్యభారమంతా తన నెత్తిన వేసుకున్నాడు. ఇబ్రహీం అదిల్షా ఆ మంత్రి చేసిన మహా ఉపకారానికి ఎంతో సంతోషించాడట. అందుకుగాను ఇప్పటి అదిలాబాద్ ప్రాంతాన్ని అతనికి జాగీరుగా బహూకరించాడట. ఆ జాగీరు ప్రాంతానికి అప్పట్లో ఆ మంత్రి ఆదిల్షాబాద్ (ఆదిల్షా + అబాద్ అబాద్ అంటే 'పొందు పరిచింది' అని అర్థం) అనే నామకరణం చేసుకున్నాడట. ఆ పేరే కాలక్రమంలో అదిలాబాద్ మారిందని చరిత్రకారులు చెపుతున్నారు. అదిగో ఆ అదిలాబాద్ మహారాష్ట్ర దిగువన వుంది. ఇది విశాలమైన జిల్లా, దీని వైశాల్యం 16,126 చదరపు కిలోమీటర్లు, ఈ జిల్లాలో ఉన్నన్ని నదులు మన రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేవు. ఎప్పుడూ గలగల పారే నదులే ఈ జిల్లాక్ సరిహద్దు రేఖలై ఉన్నాయి. దక్షిణంగా గోదావరినది, తూర్పున ప్రాణహిత వుంది. ఉత్తర పడమర దిక్కుగా పెనంగ, వార్ధా నదులతో మహారాష్ట్రని అనుకొని వుంది. ఈ జిల్లా విస్తీర్ణంలో నలభై శాతం అడవులే. ఆ అడవులు దక్షిణ భారత దేశానికి వాకిలిముందలి పచ్చతోరణంలా చూడముచ్చటగా వుంటాయి. ప్రకృతి సౌందర్యానికి వన్నె తెచ్చే అడవులు, అడవుల్లో వాగులు, వరదలు, వాటి పక్కనే ఆకాశమంత ఎదిగిన పెద్ద గిరులూ ఉన్నాయి. గిరులపై నుండి జలజల దూకే కుంటాలా, స్వర్ణ, సాత్నాల, పొచ్చర, గాయిత్రి ఇలా ఎన్నో జలపాతాలు, ఆ జలపాతాల అంచుల్లో అందమైన రకరకాల రంగురంగుల పక్షులు కనిపిస్తాయి. వాటి కిలకిలమనే చప్పుళ్లు ఎప్పుడూ వినిపిస్తుంటాయి. ఆ అడవుల కొండ గుహల్లో ఎన్నో పాతరాతి యుగపు పనిముట్లు దొరికాయి. పూర్వమెప్పుడో రాజ్యమేలిన గోండు రాజుల కోటల శిథిలాలు కనిపిస్తాయి. మనుషులకి దూరంగా మసలే వన్యమృగాలు అడవుల గుహల్లో, కొండచరియల్లో, పొదల్లో, చెట్ల గుబురుల్లో దాగి వుంటాయి. దాహం వేసినప్పుడు మెల్లగా బయటికి వస్తాయి. పచ్చి పాలవలె తెల్లగా పారే నీటి అంచులో నిలబడి, నీళ్లు తాగుతాయి. మళ్లీ కనిపించీ కనిపించనట్లే కనుమరుగైపోతాయి. అట్లాంటి అడవిలో ఒక గోండు గూడెం సంకెనపెల్లి, చలికాలం రోజులు, రాత్రి సమయం. వెన్నె విరబూసింది. వెన్నెల ఎంత పండుబారి వెలుగులు చిమ్ముతున్నా, చలి మాత్రం తన పద్ధతిలో తాను వుంటుంది గదా!?... ఒంటిమీద గుడ్డలు సరిగాలేని గోండుల్ని అది వణికిస్తుంది. గుడిసెల ముందు చలి నెగళ్లు, నెగళ్ల చుట్టూ కొందరు పడుకున్నారు. కొందరు కూర్చొని చేతులు చాచి కాపుకుంటున్నారు. గూడెం మధ్యలో ఒక చలి నెగడు ముందు నలుగురు పిల్లలు కూర్చొని ఉన్నారు. రాత్రి బాగా పొద్దుపోయినా వాళ్ల తాత మోతీరాం గోండు ఇంకా రాలేదేమా!! అని వాళ్లు ఎదురు చూస్తున్నారు.