
KONDA MEEDA GORRELA MANDA
₹200
In stock · 115 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400187
KONDA MEEDA GORRELA MANDA (Katha Samputi) by M.V.V. Satyanarayana నిరుపేద ఎప్పుడూ ధనిక స్వామ్యానికి ఎందువల్ల ఫుట్ రెస్ట్గానే ఉపయోగపడతాడో, ఆ పేద ఇంట్లో ఒక మూగజీవి అమృతం తాగుతూ అక్కడే ఎందువల్ల ఉండిపోయిందో, ఆ బాలుడు తన ప్రస్తుత స్థాయిని అధిగమించి తన పాఠశాలలో మొదటివాడుగా ఎలా వచ్చాడో, తప్పనిసరిగా తెలుసుకోవలసిన జరూరు నిర్ణయం కుడిఎడమలుగా అమలులో కొస్తే, అంకెల పిచ్చోడికి అంతిమస్థానం ఎక్కడ దఖలు పడుతుందో, తన కుటుంబానికి పెద్ద దిక్కు లేని లోటును పసిహస్తం ఎలా పూరించాలను కుందో, తరాలు దాటి ఎదుగుతున్నా సరే వాళ్ళు తమ మనసులను ఎక్కడ పాతరేసుకుంటున్నారో, దేవుడి నగలను ఏ దివ్యశక్తి కాపాడిందో, సమస్యలకోసం వెంపర్లాడుతున్న దంపతులకు ఏ చెట్టు కింద జ్ఞానోదయం కలిగిందో, మద్యపాన వ్యసనం నుండి ఆ నడి వయస్కుడు ఏ రకంగా బయటపడగల్గేడో, తన ఇంటికి వచ్చిన మహిళా అతిథి మూలంగానే తాను అవిటిది అయిన సంగతి ఆ వృద్ధురాలికి ఎలా తెలుస్తుందో, వెండితెర వెలుగుల జిలుగులతో కళ్ళు మూసుకుపోయిన ఆ యువకుడి జీవన చలన చిత్రానికి ఏ మలుపు కాచుకొనివుందో, వృద్ధుడికి ఉపకారం చేయబోయిన ఆ దైవారాధకుడికి తల ఎలా బొప్పి కట్టిందో విస్తృతానుభవాల జీవన ఘట్టాల పరంపర. వాస్తవాలకు దగ్గరగా వుంటూనే చిన్నపాటి గమ్మత్తు కలిగించే పాత్రలూ, వాటి విపరీత చర్యలూ చదవడం మొదలుపెడితే చకచకా జారిపోయే సంభాషణలూ, వాటిని పెనవేసుకున్న ఉత్కంఠ. వందలాది వైవిధ్యభరిత కథలు రచించిన ఎమ్.వి.వి. సత్యనారాయణ కలం నుండి మనవైపు చొరబడిన కొండమీద గొర్రెలమంద ఇది. ఆసక్తికర కథనాల సమాహారం కూడా ఇదే! ISBN 978-93-91400-18-7 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 9789391 400187