
KONDA POLAM
₹250
In stock · 10 available
PublisherTAANA PRACHURANALU
LanguageTelugu
ముందుమాట ప్రచురణకర్తల తెలుగుభాష, సంస్కృతులను పోషించి, పరిరక్షించుకోవాలన్న ఆశయంతో నలభై ఏళ్ల క్రితం, 1977లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu As-sociation of North America TANA) ఆవిర్భవించింది. నాలుగు దశాబ్దా లుగా ఈ ఆశయసిద్ధికి అటు అమెరికాలోనూ, ఇటు తెలుగునేల పైనా అనేక కార్యక్రమాలను తానా నిర్వహిస్తోంది. తానా రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభల్లో తెలుగుభాష, సాహిత్యాలకి ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుంది. తానా సభల జ్ఞాపిక సంచికల్లో తెలుగుభాష, సంస్కృతులకు పెద్దపీట వేసి, అవి కలకాలం గుర్తుండే విధంగా రూపాం దిస్తుంది. అంతర్జాలంలో తెలుగుభాష నిఘంటువు అవసరాన్ని గుర్తించి, ఆంధ్రభారతి సంస్థ సహకారంతో ప్రపంచంలోని తెలుగువారందరికీ అందు బాటులోకి తెచ్చింది. ప్రతి సంవత్సరం వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకత్వంలో వెలువడుతున్న వార్షిక కథా సంకలనాలకు దాదాపు రెండు దశాబ్దాలుగా ఆర్థిక సహకారాన్ని తానా అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల బయట నివసిస్తున్న తెలుగువారిలో తెలుగును పరిరక్షించ టానికి తానా 'ఎల్లలు లేని తెలుగు' అనే కార్యక్రమాన్ని చేపట్టింది. భాషా ఉద్యమకారుడు స.వెం. రమేశ్ సహకారంతో తమిళనాడులోని ఉడుమలపేట ప్రాంతంలోని వంద గ్రామాల ప్రజలచే తెలుగు అక్షరాన్ని దిద్దించింది.