
KONDAVEEDU KAIFEEYATU
₹100
In stock · 1 available
PublisherMODUGULA RAVIKRISHNA
LanguageTelugu
కొండవీటి కైఫియ్యతు కొండవీటి చరిత్రకు ఆధారభూతమైన పలు గ్రంథాలలో కొండవీటి కైఫియ్యతు ఒకటి. ఈ పుస్తకం నిడివిలో చిన్నదైనప్పటికి విలువలో గొప్పది. నేను కొండవీటికోట అభివృద్ధికి గత దశాబ్దంన్నర కాలం నుంచి కృషి చేస్తున్నాను. కొండవీటి చరిత్రను తెలియజేసే అనేక గ్రంథాలను నేను సేకరించాను. వాటిలో కొండవీటి కైఫియత్ లేదు. ఈ విషయం నన్నెంతగానో బాధించేది. మోదుగుల రవికృష్ణగారు నాకు గత 15 సం||ల నుంచి పరిచయం. 2012లో ప్రారంభించిన కొండవీడు హెరిటేజ్ సొసైటీకి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారు అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శి, రవికృష్ణ కోశాధికారి, ఈ సొసైటీ ద్వారా కొండవీడు చరిత్రకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో లేని గ్రంథాలను సేకరించి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారి సహకారంతో, రవికృష్ణ సంపాదకుడిగా ముద్రించాలని అనుకున్నాం. కారణాంతరాలవల్ల ఆ పని జరగలేదు. ఈ పుస్తకం కంటే ముందు కొండవీడుకోట మీద ఒక మంచి కాఫీటేబుల్ బుక్ తీసుకురావాలని నిశ్చయించి కొంత ప్రయత్నం చేసి మరలా దానిని పూర్వపక్షం చేసి ముందుగా కొండవీడు కైఫియ్యతుని పాఠకుల ముందుంచుట సముచితమని భావించి దీనిని తీసుకొస్తున్నాము. ఈ గ్రంథం రవికృష్ణ సంపాదకత్వంలో నభూతో నభవిష్యతి అన్న విధంగా రూపుదిద్దుకుంది. ఈ పుస్తకానికి విశేషాలనేకం వున్నాయి. రవికృష్ణ పాఠకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రస్తుతం వాడుకలో లేని ప్రతి పదానికి ఫుట్ నోట్స్ రూపొందించటం ఒక విశిష్టత. కైఫియత్తులను నేటి కాలానికి ఎలా ప్రచురించాలి అనేదానికి ఈ కొండవీటి కైఫియత్ ఒక నమూనా అని నా భావన. ఈ గ్రంథంలో కొండవీడులోని పలు కట్టడాల ప్రస్తావన వుంది. అవి ప్రస్తుతం దుర్గమారణ్యంలో ఎక్కడో పడివున్నాయి. వాటి ఛాయాచిత్రాలను సందర్భోచితంగా గ్రంథంలో పొందుపరచటం జరిగింది. ఎక్కడా రాజీపడకుండా మంచి పేవరు వుపయోగించి కలర్ ఫోటోలతో తీసుకురావడం మరియొక విశిష్టత. అందుకే ముందెన్నడూ లేని విధంగా ఈ గ్రంథాన్ని ప్రచురిస్తున్నామని చెప్పే సాహసం చేశాను.