KOSAMERUPULU by DR.G.V.PURNACHANDU Telugu book cover

KOSAMERUPULU

by DR.G.V.PURNACHANDU

₹30
In stock · 14 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
పిడుగులకు ముందు.... చూసినవీ, విన్నవీ - అలానే చదిపిన ప్రతిదీ కాకుండా కొన్ని మాత్రమే అవిస్మరణీయంగా నిలచిపోతాయి. అవి నలుగురికీ పంచమని తొందరపెడతాయి. రచయితనైతే మరీను. డాక్టర్ పూర్ణచంద్ గారికి స్వతః పుస్తకపఠనం ఒక తీరని దాహం. ఏ కారణం వల్లతో ఆయన అసంఖ్యాకంగా జీవిత చరిత్రలు, స్వీయచరిత్రలు చదివారు. అవసరమైన అంశాలను ఉపయోగించగా ఇప్పుడు పరిశేషం చక్కని ర్యాయికలుగా మనకు దక్కుతున్నది. ఈ పుస్తకంలోని ఖండికలలో ఏవీ ఆయన సొంతం కాదు. అంటే కల్పితం కారు సంకలనం, వ్యాఖ్యానం మాత్రమే ఆయన సొంతం. తన సంకలనానికి కొసమెరుపులు' అని పేరు పెట్టడమే తమాషాగా ఉంది. అసలు మనకు మెరుపులే ఉన్నాయిగాని కొసమెరుపులు లేవు. ఎ.బి.కె.గారు ఇంగ్లీషులో 'టెయిల్ స్పార్క్' అన్న మాటకు అందంగా చేసిన మిధ్యానువాదమే కొసమెరుపు. వాస్తవానికి ఏదైనా మెరుపే! ఏ మబ్బు కొసలోను మెరుపు మెరవదు. చెమకమనిపించే మెరుపు మెరవదు. చెమకమనిపించే ముగింపు కొసమెరుపు అయితే విషయానికి ప్రాధాన్యం ఉండదు. చివరలో ముక్తాయింపునకే ప్రాధాన్యం ఉంటుంది. మెరుపు జిగేల్ అనిపించి మాయమవుతుది. మిగిలేది మబ్బు మాత్రమే. బహుశా ముక్తాయింపు అనడానికి ఎ.బి.కె కొసమెరుపు అన్నారేమో! డాక్టర్ పూర్ణచంద్ గారు వ్రాసిన అన్ని అఖ్యాయికలకు చిరంజీవత్వం ఉన్నది. తటిల్లతలా మెరిసి మాయమయ్యే ఆయుర్దాయం కాదు ఈ ఖండికలది. ఎందువల్లనంటే అవి విషయపూర్ణమైనవి. కాని, వర్తమాన సామాజిక విలువలకు, స్వరూపాలకు, ఈ ఖండికలలోని వస్తువులు కొసమెరుపులు. చాలా అబ్బురపర్చుతాయి. జిగేల్ అనిపిస్తాయి మెరుపుల్లాగా. ఉదాహరణకు 'హిందూ' పత్రిక పూర్వగాథ. అది నేటి ఆ సంస్థ స్వరూపానికి కొసమెరుపు. సత్తువ తక్కువైన శృంగార పురుషులకు నరాలు, కరాలు బలంగావున్న మనుషుల శృంగారం గురించి వ్రాసిన ఆఖ్యాయిక ఒక కొసమెరుపు. పరీక్షలంటే హడలే' అన్న ఖండిక భిన్నమైన కొసమెరుపు. ఎంచుకొన్న విషయమే మెరుపు లాంటిది. ఇలా కొసమెరుపుల్లో చాలా వైవిధ్యం చూపించారు.