
KOTHI KAMKANAM - 50
₹50
In stock · 651 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పసిమనసు రాఘవరావుగారు కూతురును చూడటానికి పట్నం నుండి వచ్చారు. ఆయన కర్నూలు జిల్లాలో హెడ్ మాస్టర్. తాతగారిని చూసి పరుగున వచ్చాడు పవన్. మనవడిని ఎత్తుకుని ముద్దాడుతూ ఇంట్లోకి నడిచాడు రాఘవరావుగారు. " అమ్మా! అమ్మా! తాతయ్య వచ్చాడు” అరిచాడు పవన్. శైలజ కిచెన్ రూమ్ నుండి బయటికి వచ్చి తండ్రిని క్షేమ సమాచారాలడిగింది. అనంతరం అల్లుడుగారింకా రాలేదా? అడిగారాయన ఆఫీస్ టైమ్ అయిపోయింది కదా! వస్తుంటారు నాన్నా అని చెప్పింది శైలజ. మనవడితో ఆడుకుంటూ కబుర్లలో పడ్డాడు రాఘవరావుగారు. తండ్రి కోసం పవన్ మనసు ఎదురుచూస్తోంది. ఆఫీస్, దారి కబుర్లు పూర్తిచేసుకుని రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చాడు రంగనాథం. రాగానే పరుగున వెళ్లి తండ్రి చేయి పట్టుకున్నాడు పవన్. అలసటగా వున్న రంగనాథం చేయి విడిపించుకున్నాడు. మామగారిని చూసి క్షేమ సమాచారాలు అడిగాడు. టవల్ తీసుకుని బాత్ రూమ్ వైపు నడిచాడు. తండ్రి తనను ఎత్తుకోవాలని "నాన్నా! నాన్నా! నేను బొమ్మ గీశాను చూడు" అన్నాడు. రంగనాథం టి.వి.పై నుండి చూపు మరల్చలేదు. పలకలోకి చూడకుండా ఎబిసిడిలు రాసుకోకుండా ఈ బొమ్మలేంటి? వెళ్ళి ఎబిసిడిలు రాయి. వెళ్ళు" అన్నాడు చెంపలు నిమిరి. తాను గీసిన బొమ్మ చూసి నాన్న మెచ్చుకుంటాడని ఆశపడిన పవన్ ముఖం చిన్నబోయింది. మెల్లగా వెళ్ళి గోడవారగా కూర్చున్నాడు. ఎబిసిడిలు వచ్చినవన్నీ రాశాడు.