
KRISHNAPAKSHAM - 100
₹100
In stock · 19 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
దేవులపల్లి కృష్ణశాస్త్రి 1-11-1897 24-2-1980 భావకవిత్వపు ప్రయోక్తా, ప్రచారకుడూ, కృష్ణపక్షానికి వెలుగులరేడు. తెలుగుదనానికి సూటిదనాన్నీ, సాహిత్యం కమ్మదనాన్నీ కలగలిపి చిత్రసీమను సేవించిన స్వరార్చకుడు. దేవుని ఉనికి పట్ల ఉపేక్ష వహిస్తూనే నిరాకారుణ్ణి భజించిన భక్తకవి. దేశంలో మతం పేరిట జరిగే దారుణ మారణకాండను “మతం వద్దు గితం వద్దు, మారణ హెూమం వద్దు" అంటూ ఎలుగెత్తి జాతి, మతాల సమైక్యతను చాటిన లౌకికవాది. "ఆకాశము నొసట పాడుచు అరుణారుణ తార" అంటూ ఆగామికాలాన్ని ఊహించిన ఆశావాది. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను 'శాస్త్రీ'య ముద్రతో సుసంపన్నం చేస్తూ పలుగ్రంథాలు రాసిన రసవాది. 1964 నుండి మూగవోయిన గొంతుతో మౌనరగాలు ఆలపించిన 'వాగ్గేయకారుడు'. స్వేచ్ఛా సమానత్వాల బావుటాలెత్తిపట్టిన కాల్పనిక కవిత్వంతో ప్రారంభించి, ప్రగతిశీల సాహిత్యపు తాత్వికతను ఆహ్వానించి, కొన్ని దశాబ్దాలపాటు తెలుగు కవిత్వం వడినీ, కవుల నడవడినీ ప్రభావితం చేసిన కులగురువు. అధ్యాపకుడుగా జీవితాన్ని ఆరంభించి, నిత్యాధ్యయనశీలిగా, కవిత్వ పథనిర్దేశకుడుగా జీవితాంతం నిలిచాడు. కళాప్రపూర్ణ, పద్మభూషణ్ వంటి బిరుధులకు - కృష్ణశాస్త్రి లభించటంతో వాటికే వన్నెవచ్చింది. వారికి లభించిన సన్మాన సత్కారాలకే ఖ్యాతి దక్కింది. "ఆ తరం కవులు అందరు ఒక ఎత్తు. కృష్ణశాస్త్రి గారొక ఎత్తు. వారిలో కృష్ణశాస్త్రి గారే కొంచెం ఎత్తు" అన్న కొలమానం వీరి ఔన్నత్యానికి నార్ల సాక్షి సంతకం. "తెలుగు దేశపు నిలువుటద్దం బ్రద్దలైంది. షెల్లీ మళ్ళీ మరణించాడు. వసంతం వాడిపోయింది" అన్న శ్రీశ్రీ స్మృత్యంజలి తెలుగు కవిత్వ చరిత్రలో కృష్ణశాస్త్రిగారి నిలువెత్తు సంతకం. "మనకు ఒక్కటే తాజ్మహల్ ఉన్నది. మనకు ఒక్కడే కృష్ణశాస్త్రి ఉన్నాడు."