KRUTAYUG by SURYADEVARA RAMMOHANA RAO Telugu book cover

KRUTAYUG

by SURYADEVARA RAMMOHANA RAO

₹200
In stock · 20 available
PublisherMADHUPRIYA PUBLICATIONS
LanguageTelugu
కృతయుగ్ అది ఉత్తరాంధ్రలోని చెర్ల గ్రామంనుండి ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని దంతెవారాకు వెళ్ళే రహదారి. సరిహద్దుకు సుమారు నలభై కిలోమీటర్ల దూరం ఇవతలే ఉంది చెర్ల. ఆ మార్గంలో సరిహద్దు వైపు - పరుగుతీస్తోంది ఒక ట్యాక్సీ. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం. వాతావరణం ఆహ్లాదభరితంగాఉంది. ఈ సంవత్సరం వేసవి అంతగా తెలీటం లేదు. పగలు ఎండ, రాత్రిళ్ళు చలిగా ఉంటోంది. కారు నడుపుతున్న యువకుడికి ఇరవై ఏడు సంవత్సరాల వయసుంటుంది. మనిషి ఆరడుగుల పొడవుకు తగ్గదు. తగినలావు, కండలు తిరిగిన దండలు అతడి అందాన్ని, ఆరోగ్యాన్ని చాటుతున్నాయి. తీర్చిదిద్దినట్లుండే కను ముక్కుతీరు, ఒకసారి చూస్తే తిరిగి చూడాలనిపించే ఆకర్షణ అతడిలో వుంది.