
KULA VYAVASTA ACHARANATMAKA KARYAKRAMAMU
₹5
In stock · 1 available
PublisherCPI (M.L) NEWDEMOCRACY
LanguageTelugu
కుల వ్యవస్థ - ఆచరణాత్మక కార్యక్రమము ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత దేశంలో కుల వ్యవస్థ ఏర్పడి, కొనసాగుతూ వుంది. దేశంలోని ప్రజలు వర్గం, జాతి, మతంతో పాటు, సాంఘికంగా కులాల ప్రాతిపదికపై కూడా విభజింపబడి వున్నారు. కులాలు అనేక ఉపకులాలుగా విభజింపబడి వున్నాయి. హిందూ మత ప్రభావం వలన హిందూ మతంలోనే కాక, క్రైస్తవ, మహమ్మదీయ, సిక్కు మతాలలో కూడా కులాలు ఏర్పడ్డాయి. సమకాలీన భారత సమాజంలో వర్గ విభజనతో పాటు, కులాలుగా విభజింపబడి, కుల వ్యవస్థ కొనసాగుట భారతదేశం యొక్క ప్రత్యేక లక్షణాలలో ముఖ్యమైనది. సమాజం ప్రారంభంలో వర్గాలు లేవు. పాలకులు, పాలితులు లేరు. శ్రమ చేసేవారు, శ్రమదోపిడీ చేసేవారు లేరు. అందరూ సమానమే. కాని వాని విజ్ఞానం, ఉత్పాదక శక్తి చాలా పరిమితం. వారి శ్రమ ఫలితం వారి మనుగడకే సరిపోయేది కాదు. మనుగడ కొరకు ప్రకృతి శక్తులతో నిరంతరం జరిగిన పోరాటంలో మానవుని విజ్ఞానం, ఉత్పాదక శక్తి పెరిగాయి. ఉత్పాదక శక్తులు పెరిగిన క్రమంలో మొదట స్త్రీ, పురుషుల మధ్య, క్రమంగా పశుపాలన, చేతి వృత్తులు, వ్యవసాయం అభివృద్ధి అయ్యి, శ్రమ విభజన జరిగింది. క్రీ.పూ. 3000-2000 సం||ల నాడు విలసిల్లిన సింధూ నాగరికత నాటికే సమాజం స్థిర నివాసం నగర, సంస్కృతి స్థాయికి చేరుకుంది. సింధూ నాగరికత బానిస సమాజ స్థాయికి చేరుకుందని, దీని నిర్మాతలు ద్రావిడులని, ఆదిమ భారతీయ తెగలకు చెందిన వారని చరిత్ర కారులు పేర్కొంటున్నారు. వర్ణ వ్యవస్థ : ఆర్యులు మధ్య ఆసియా నుండి క్రీ.పూ. 1750 ప్రాంతం నుండి వచ్చారు. అప్పటికి వీరు పశుపాలక సంచాలక స్థితిలో వున్నారు. ఉత్పాదక శక్తుల అభివృద్ధి, సాంస్కృతిక స్థాయిలలో సింధూ నాగరికత ప్రజల కంటే బాగా వెనుకబడి వున్నారు. తెగలలో వుండే సహజమైన సామూహిక ఐక్యత, గుర్రాలపై స్వారీ చేస్తూ, విల్లమ్ములతో యుద్ధం చేయుటలో నైపుణ్యత వలన వీరు యుద్ధంలో స్థానికులను ఓడించారు. ఆర్యులు తెలుపు లేక గోధుమ రంగు కలిగి వుండగా, సింధు నాగరికత ప్రజలు నలుపు రంగు కలవారు. ఇదే వర్ణ విభజనకు మూలం. వేదాలన్నింటిలోని ప్రాచీన వేదమైన ఋగ్వేదంలో ఆర్యులు, ఆర్యేతరుల మధ్య విభజనను గుర్తించటానికి వర్ణం అనే మాటను వాడారు. వర్ణం అనే పదం బాగా వాడుకలోనికి వచ్చి, ఆర్యులలో కూడా సామాజిక శ్రమ విభజన తరగతులకు కూడా వర్తింప చేయబడింది. ఋగ్వేదం క్రీ. పూ. 1400-1200 మధ్య గ్రంథస్తం చేయబడింది. అప్పటికి సామాజిక శ్రమ