KULAKANTHA CHETILO KANAKAMBARALU by DR.B.K.PRASAD Telugu book cover

KULAKANTHA CHETILO KANAKAMBARALU

by DR.B.K.PRASAD

₹60
In stock · 301 available
PublisherMAHATHI PRINT CREATIONS
LanguageTelugu
"ముక్కుపచ్చలారకముందే" ముగుదాడుగా ఇంగ్లీషా?! “ప్రాణికోటి అంతటిలోనూ మానవుని జన్మ విశిష్ట మయినది. కాని మానవత్వంతో మెలగడం అంతకంటే విశిష్టమైనది. మనుగడకు ఎదురవుతున్న పెద్ద సవాలు కూడా అదే" అంటాడు సన్న్యాసి కాకపోయినా బౌద్ధాన్ని విశ్వసిస్తున్న డాక్టర్ సుగతపాల డి సిల్వా, బౌద్ధమతంలోని హీనయాన శాఖకు చెందిన డి. సిల్వా ఆరాధించేది విగ్రహాలను కాదు మానవులను మాత్రమే. సంఘానికి శరణు అంటాడు. అందుకే శ్రీలంక భాషా తత్వవేత్త అయిన డి. సిల్వా భావధారకు సరిహద్దులు లేవు. అసమానతలు ఏ రంగంలో ఉన్నా తొలగిపోవాలంటాడు. సంఘజీవుల మధ్య భావ సమైక్యానికి భాష ఒక సాధనమైనప్పుడు కృతకమైన బంధాలన్నింటినీ పటాపంచలు చేయాలంటాడు. పెద్ద ఎత్తున నిరక్షరాస్యత పెనుభూతంలా వెంటాడుతున్న దేశాలలో అందరికీ 'డొక్కశుద్ధి' కలిగించాలంటే సాహిత్య భాషకూ మాట్లాడే భాషకూ మధ్య, లిఖిత రూపాలకూ మౌఖిక రూపాలకూ మధ్య వ్యత్యాసాలు తొలగిపోవాలంటాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరణతో ఇచ్చిన ఫేలోషిప్ను గౌరవంగా భావించి ఇటీవలనే అంతర్జాతీయ తెలుగు సంస్థ డాక్టర్ ఎ.బి.కె.ప్రసాద్ 7