KULANTHARA VIVAHALU SAMAJIKA SANGARSHANALU - 250.00 by REKA KRISHNARJUNARAO Telugu book cover

KULANTHARA VIVAHALU SAMAJIKA SANGARSHANALU - 250.00

by REKA KRISHNARJUNARAO

₹250
In stock · 99 available
PublisherREKA KRISHNARJUNARAO
LanguageTelugu
కులాంతర వివాహాలను వ్యతిరేకించటమనేది ఒక్క అగ్ర కులాలకు చెందిన విషయం మాత్రమే కాదు. అది అగ్ర కులాలకే పరిమితమై ఉన్నట్లయితే కుల వివక్షత ఇంత పెద్ద సామాజిక సమస్యగా బుసలు కొట్టేది కాదు. అది బీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం బహుజనులందరికీ వ్యాపించింది. బహుజన కులాలందరిలోనూ కులాంతర వివాహాలపట్ల | ప్రాధమికంగా వ్యతిరేకతే కొనసాగుతున్నది. కుల వ్యవస్థ వల్ల ఎవరైతే పీడించబడుతున్నారో, ఎవరైతే దాడులకు- హత్యలకు గురికాబడుతున్నారో, ఎవరైతే విద్యకు,సంపదకు, సాంఘిక గౌరవానికి దూరంగా నెట్టివేయబడుతున్నారో, ఎవరైతే ఈ | కులవ్యవస్థ వల్ల వేల సంవత్సరాల నుండి తమ సర్వస్వాన్నీ కోల్పోతూ వస్తున్నారో వారు కూడా ఈ కులాంతర వివాహాలను నిరసిస్తూ కుల చట్రంలో జీవించటానికే ఇష్టులుగా వుంటున్నారు. ఇది నిజంగా భావ జాల రంగంలోను, భౌతిక రంగంలోను మనువు సాధించిన ఘన విజయంగా అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఎవరైతే బాధితులుగా వున్నారో, ఏ కుల వ్యవస్థయితే తమ సర్వ సమస్యలకు ప్రధాన కార ణంగా వుందో, ఆ కుల వ్యవస్థను ఆ బాధితులే ఇష్టంగా మోస్తూ ఇది కొనసాగాల్సిందే అని వారే అనుకునేలా చేయటం, దాన్ని రక్షించ టానికి దళిత, ఆదివాసి, బహుజనులు తమ రక్త చిందించటానికి కూడా వెనుకాడకపోవటం అనేది చిన్న విషయం కాదు కదా!