
KUTUMBA PARIGNANAM - FAMILY WISDOM - 275.00
by ROBIN SHARMA
₹275
Currently out of stock
PublisherJAICO PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788184953169
"రాబిన్ శర్మను అనుసరించేవారి సంఖ్య దలైలామా అనుచరుల సంఖ్యతో పోటీ పడుతోంది.” ది టైమ్స్ ఆఫ్ ఇండియా "అంతర్జాతీయ మానవతావాది." సిఎన్ఎన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రచురణ 'ది మాంక్ హూ సోల్ట్ హిజ్ ఫెరారి' రచయిత, అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కిన నాయకత్వ గురువు రాబిన్ శర్మ మీ బిడ్డలో సహజ, సంభావ్య నాయకత్వాన్ని మేలుకొలపటం ఎలాగో అతి ప్రభావవంతమైన పద్ధతిన, అతి సరళ మార్గంలో విశేషమైన ఈ పుస్తకంలో వివరిస్తారు. ఆ ప్రక్రియలో మీ జీవితం సంపన్నమూ, ప్రతిఫలదాయకమూ అవుతుంది. ప్రగాఢమైన అంతర్దృష్టితో, ఉత్సాహభరితమైన హృదయంతో ఆయన కుటుంబ యజమానికి అవసరమైన అయిదు కౌశల్యాలను, వాటికి సాయంగా కింది ఆచరణాత్మక పాఠాలను బోధిస్తారు. " మీ బిడ్డలో అత్యుత్తమ నైపుణ్యాలు, అత్యున్నత సామర్ధ్యాలు వెలికి తేవటం " మీ ఆప్తులకు, మీకు మధ్య బాంధవ్యం ప్రగాధం చెయ్యటం మీ బిడ్డల దృఢమైన శీలానికి, మానసిక వివేచనకు ప్రేరణ కలిగించటం " పెద్దకలలు గనాలనీ, నిజమైన సఫలత సాధించాలనీ నేర్పటం మీ జీవితాన్ని సమతుల్యంచేసి, సరళత, ఆనందం, శాంతితో జీవించటం " జీవితంలో అత్యంత ముఖ్య దశనుచేరి, అందులో ఆనందాలు అనుభవించటం రాబిన్ శర్మ ప్రపంచమంతటా ఆదరణ పొందిన మానవతావాది. ఉన్నత నాయకత్వానికీ, వ్యక్తిగత సామర్ధ్యాన్నిపెంపొందించటానికీ అత్యున్నత సలహాదారులుగా ఆయనప్రపంచ మంతటా పేరుపొందారు. ప్రసిద్ధి చెందిన కోటీశ్వరులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులు, అనేక ఫార్ట్యూన్ 100 సంస్థలుఆయన ఖాతాదారులు. అగ్రస్థానం అధిష్టించిన ఆయన రచనలు 'ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ' (తన ఫిరారీ అమ్మిన సాధువు), 'ది గ్రేట్ నెస్ గైడ్' (ఘనతకు మార్గం), 'ది లీడర్ హూ హాడ్ నో టైటిల్ (పదవి బిరుదు లేని నాయకుడు), ప్రపంచంలో 92 భాషలలో ప్రచురణ పొందాయి. ఈ రచనలు ఆయనను ప్రపంచమంతటిలోను అత్యధిక పాఠకులు గలరచయితగా నిలబెట్టాయి.