
KUTUMBAMA RAELAX PLEASE
₹200
In stock · 28 available
PublisherSWAMI SUKHABODHANANDA
LanguageTelugu
కుటుంబమా, రిల్యాక్స్ ప్లీస్ ! ఈ శీర్షిక చూడగానే నేను దేన్ని గురించి మీకు చెప్పాలను కుంటున్నానో మీకు తెలిసి పోయివుంటుంది ! నిజమే! సుఖసంసారానికీ, పిల్లల్ని సక్రమంగా పెంచడానికీ అవసరమైన కొన్ని ముఖ్యమైన విషయాల్ని గురించి నేను మీకు చెప్పాలను కుంటున్నాను. మీరు కనుబొమలెగరేసి, ఆశ్చర్యంగా నన్ను చూడటం నాకు తెలిసి పోతూనేవుంది! కాషాయ వస్త్రాలు ధరించిన స్వామీజీ కదా వీరు! పెళ్ళి చేసుకోని బ్రహ్మచారి. పిల్లా, పాపా లేనివారు. అలాంటప్పుడు సంసారం గురించీ, పిల్లల పెంపకం గురించీ వీరికి అనుభవం పిసరు కూడా లేన్నప్పుడు వాటి గురించి మనకేం సలహాలు చెప్పగలరు? ఇదే కదా మీ అనుమానం? కుటుంబమా, రిల్యాక్స్ ప్లీస్! నేను మనదేశంలోనే కాకుండా, అమెరికాలాటి విదేశాలలోని ఎన్నో పట్టణాలలో లైఫ్ (జీవితం) అనే కార్యక్రమాలు చేస్తుంటాను. వాటిల్లో ద్యానం, యోగ, భగవద్గీత, వేదానికి సంబంధించిన అనేక విషయాలను బోధిస్తుంటాను. సుఖసంసారం, పిల్లల పెంపకం గురించి కూడా చెప్తుంటాను. బెంగళూరులో నేను సుఖసంసారం అనే workshop నిర్వహిస్తున్నానని ప్రకటించిన సందర్భంలో చాలామంది వద్దని నచ్చచెప్పారు. మరికొంత మంది నేరుగా నన్ను కలిసి, సన్యాసం పుచ్చుకున్న మీరు సంసారం గురించి సలహాలు చెప్పటం ఎంత వరుకు సముచితం- అని గట్టిగా చర్చించడం మొదలు పెట్టారు. నేను వాళ్ళకు నచ్చ చెప్తూ "కామసూత్రం రచించిన వాత్సాయనుడు కూడ బ్రహ్మచారి అన్న విషయం మీకు తెలుసా?" అని అడిగాను. ఈ ప్రపంచంలో జీవించి మరణించిన తరువాత మీ జీవితా లేమౌతాయి అని చెప్పడం మాత్రమే ఒక సన్యాసి బాధ్యతకాదు. మనిషి జీవితానికి వుపయోగపడే మంచి చెడ్డలు తెలియచెప్పి, శాంతి సంతోషాలతో, సంతృప్తిగా ఎలా జీవించాలో చెప్పడం కూడా నా కర్తవ్యమని నేను అనుకుంటున్నాను" అన్నాను.