
LABAN GEETHALU
₹40
In stock · 12 available
PublisherTHALLURI LABAN BABU
LanguageTelugu
ఆధునిక చాటువులు - 'లాబన్ గీతాలు' తాళ్లూరి లాబన్ బాబు విద్యాగంథం వున్న కుటుంబంనుండి వచ్చినవారు. ఆ గంధాన్ని తనూ వొంటపట్టించుకుని, పరిమళిస్తూ తన శక్తిమేరకు సాహిత్య సృజన చేస్తున్నారు. ఇంతకుముందే 'జయభారతి', 'మహానిర్గమనం' వంటి కవితా సంపుటులతో కవితా లోకానికి సుపరిచితులు. మహానిర్గమనంలో వచన, గేయ రచనా ఫణితిని అనుసరించిన లాబన్బాబు ఈ సంపుటిలో ఒక కొత్త రచనా విధానాన్ని ఎంచుకున్నారు. ఇవి వచన కవితలా? గేయాలా? మాత్రాఛందస్సులో నడిచిన ముక్తకాలా అంటే అవుననికానీ, కాదనికానీ ఖచ్చితంగా చెప్పలేం- బాహ్యరూపానికి గీత పద్యాల్లా కనిపించే ఇవి అన్ని లక్షణాలను కలబోసుకున్న వచన ఖండికలు. 'లాబనీగీతాలు' అనగానే ప్రసిద్ధమైన 'గాలిబ్ గీతాలు' గుర్తుకొస్తాయి. గాలిబ్ గీతాలు మగువను, మద్యాన్ని ఆలంబనగా చేసుకుని ప్రేమతత్వాన్ని బోధిస్తే ఈ 'లాబనీగీతాలు' అనేక సామాజికాంశాలను తనదైన కోణంనుండి ఆవిష్కరించాయి. ప్రాచీన సాహిత్యంలోని 'చాటువు' ప్రక్రియకు ఈ రచన సన్నిహితంగా వున్నట్టు తోస్తుంది. చాటువుకున్న 'మృదూక్తి' అర్థం ఈ రచనకూ వర్తిస్తుంది. ఒక రకంగా ఇవి ఆధునిక చాటువులు. ఆధునిక కాలంలో శ్రీశ్రీ 'సిప్రాలి' వంటి రచనల్లో ఇలాంటి ప్రయోగాలు చేసారు. లాబన్ గీతాల్లో లేని వస్తువు లేదు. చరిత్ర, పురాణం, తత్త్వం, ప్రేమ, సామాజికాంశాలు, ఇలా ఎన్నో విషయాలపై లాబనాబ్బాబు తనదైన దృష్టికోణంతో సునిశిత వ్యాఖ్యానంచేసారు. ఇందులో కొన్ని చురుక్కుమనిపించే వ్యంగ్యపు చురకత్తులు-మరికొన్ని గిలిగింతలు పెట్టే హాస్యవల్లరులు. ఇంకొన్ని భావుకతతో తళుక్కుమనే పదచిత్రాలు- వెరసి ఇది శతవచన దళ పద్మం.