LABHASATI GAA EEMUPAKSHULA FARALA NIRVAHANA by DR.CH.RAMESH Telugu book cover

LABHASATI GAA EEMUPAKSHULA FARALA NIRVAHANA

by DR.CH.RAMESH

₹200
In stock · 150 available
PublisherSARITHA VETERINARY BOOK PUBLISHERS
LanguageTelugu
ఒక్కక్షణం ఇటీవల కాలంలో ఈము పక్షుల పెంపకం పట్ల చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకనాడు పెరటికోళ్ళ పెంపకం లాగా ఉన్న పౌల్ట్రీ, నేడు పారిశ్రామిక స్థాయికి ఎదగడం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ప్రారంభదశలో ఉన్న ఈము పక్షుల పెంపకం, భవిష్యత్తులో గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని అనుభవజ్ఞుల అభిప్రాయం. ప్రస్తుతం మనదేశంలో ఈము పక్షుల సంఖ్య, 5% సగటు అభివృద్ధి రేటుతో దినదిన ప్రవర్ధమానం చెందడం దీనికి నిదర్శనం. ప్రస్తుతం పెంపకందారులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సమస్యను అధిగమించడానికి ఈము ప్రాసెసింగ్ ప్లాంట్లు విస్తృతంగా నెలకొల్పబడిన పక్షంలో, ఈముపక్షుల పెంపకం భవిష్యత్తు, బంగారంగా ఉంటుందనుటలో సందేహం లేదు. ఈ విషయాన్ని ఔత్సాహికులు గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. ఈము పక్షుల పెంపకం గురించి, ప్రస్తుత ఈము పెంపకందార్లకు, మరియు నూతనంగా ఈము ఫారాలు ప్రారంభించాలనే వారికి పశుసంవర్ధకశాఖ, రాష్ట్ర ఈము రైతుల అధీకృత సమాఖ్య, నాబార్డు సంస్థ, ఆదర్శ పెంపకందార్లు సహాయ సహకారాలు అందిస్తూ సహకరిస్తున్నారు. మన దేశంలో కేవలం 2 దశాబ్దముల నుండే ప్రారంభమైన ఈముపక్షుల పెంపకంపై శాస్త్రీయపరమైన విషయాలతో కూడిన ఒక పుస్తకం అందుబాటులో ఉంటే... * కొత్తగా ఈము ఫారాలు ప్రారంభించేవారికి, ఈ రంగంలో ఉన్న వారికి శాస్త్రీయపరమైన మెలకువల పట్ల అవగాహన పెంపొందించే అవకాశాలుంటాయని, * అలాగే ఈము పక్షుల పెంపకంలో లాభాల గురించి, పారిశ్రామిక వేత్తలకు తెలిస్తే, ప్రాసెసింగ్ ప్లాంట్ల స్థాపనకు వారు ముందుకు వస్తారని, తద్వారా మార్కెట్ విస్తరించబడి ఎంతో మంది ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని భావించి ఈ పుస్తకం రూపకల్పన చేయబడింది.