
LADIES SPECIAL-40
by SREE MADHULATHA PUBLICATIONS
₹40
In stock · 14 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ముందు మాట ప్రతి గృహిణికి ఇంటిని తీర్చిదిద్దుకోవడం, వంటింటిని నిర్వహించడం, ఆహార పదార్థాల పోషక విలువ ను పరిరక్షించడం, పిల్లల బాగోగులు చూసుకోవడంతోపాటు తన ఆరోగ్యాన్ని, ఆకృతిని తీర్చదిద్దుకోవడం కూడా ముఖ్యం. ఎన్నెన్నో బాధ్యతలు ఉన్న గృహిణికి అన్ని సందర్భాలలోను పలు మెలుకువలు అవసరం. రోజు వారీ జీవితంలో మహిళలకు ఉపయోగపడే అవసరమైన విషయాలు పుస్తకంలో పొందుపరిచి ఉన్నాయి. గృహిణులే కాదు, ఆధునిక కాలం యువతులకు కూడా వివిధ వాతావరణాలలో సౌందర్య పోషణ గురించి, అందచందాలను ఇనుమడింప జేసుకోవడానికి, చిన్న చిన్న శారీరక ఇబ్బందులను తొలగించుకోవడానికి ఉపయోగపడు అంశాలను ఇందులో అందించడం జరిగింది. వివిధ తరహాల్లో మెరుగులు దిద్దుకుంటే, నేటి యువతులు మెరికల్లా తయారవుతారు. కాలేజీ అమ్మాయిలు మొదలు కొని అన్ని వయసుల వారికి సరైన శారీరాకృతి తప్పనిసరి. కొన్ని కారణాల వల్ల చర్మంలో చోటు చేసుకునే మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా మొహం మీద ఈ మార్పులకు ఆందోళన చెందనవసరం లేదు. తీరైన ఆకృతి కోరుకునే వారు, మోడలింగ్ రంగంలో ప్రవేశించదలచిన వారు, వీటి గురించి సరైన అవగాహన లేకుండా అడుగులు వేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శరీరంలో అవసరానికి మించి కొవ్వు ఎందుకు పేరుకుంటుందో తెలుసుకొంటే ఉపయోగపడే వ్యాయామాలను కూడా ఇందులో ఉదహరించబడ్డాయి. చక్కటి ఆరోగ్యాన్ని, తీరైన ఆకృతిని సొంతం చేసుకోవడానికి ఈ చిన్న పుస్తకం దోహదపడుతుంది. ఆహారం విషయంలో కూడా పలు సూచనలు, మార్గదర్శకాలు ఉన్నాయి. జీవన విధానంలో మహిళలు ఏఏ మార్పులు చేసుకోవాలి ? ఇంట్లో పెద్దలకు పిల్లలకు ఎటువంటి పోషకాహారం అందించాలి? మొదలైన అంశాల మీద కూడా అవగాహన కల్పిస్తుందీ ఈ పుస్తకం. చాలా మంది వనితలు శరీరంలో ఏమాత్రం మార్పు కనపడినా ఆందోళన చెందుతుంటారు. శారీరక ఆరోగ్యం, అందచందాల మీద సరైన అవగాహన కల్పిస్తుంది. ఏతావాతా మొత్తం మీద మహిళలకు, యువతులందరికీ ఆరోగ్య సంరక్షణ, సౌందర్య పోషకాల మీద ఒక చిన్నపాటి రిఫరెన్స్ పుస్తకంగా పాఠకులకు ప్రయోజనకరమవుతుందని ఆశిస్తున్నాం. అనేకకనేక అంశాల మీద చిట్కాలను కూడా ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి మహిళకు ప్రయోజనకరమైన సంవిధానంలో ఈ పుస్తకం కూర్పు చేయడం జరిగింది.