LAJJA - VPH by TASLIMA NASRIN Telugu book cover

LAJJA - VPH

by TASLIMA NASRIN

₹180
In stock · 581 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
లజ్జ తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ నగరంలో 25 ఆగస్టు, 1962లో జన్మించారు. మైమెన్సింగ్ మెడికల్ కళాశాల ద్వారా వైద్యశాస్త్రంలో పట్టభద్రురాలై, ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్నిసంవత్సరాలు డాక్టరుగా ఉద్యోగం చేశారు. తస్లీమా నస్రీన్ తన సాహిత్య జీవితాన్ని కవిత్వంతో ఆరంభించినా, క్రొత్త శైలికి ప్రతీకలైన సాహిత్యపరమైన ఫీచర్లు, వ్యాసాలు, నవలలు మొదలైనవి రచించి రాణి ప్రచురించారు. బంగ్లాదేశ్ ప్రేమిక పత్రికలన్నీ ఆమె రచనలను ప్రచురించేవి. కలకత్తాలోని ఆనంద పబ్లిషర్స్ 1992లోనూ, ఢాకాలోని నాన్నేషా పబ్లిషర్స్ 1993లోనూ వీటికి అచ్చువేశారు. 1993 ఫిబ్రవరిలో వెలువడిన “లజ్జ” నవల అయిదు మాసాల్లో 60,000 ప్రతులు అమ్ముడయ్యాయి. మత ఛాందసత్వం యొక్క క్రూరత్వ రూపం – మానవత్వాన్ని ఎలా మంటగలుపుతుందో ఈ నవలలో రచయిత్రి వివరించారు. పరమాణువు రోజుల్లో జరిగిన అనేక సంఘటనల సమాహార రూపం ఈ “లజ్జ” నవల. ఇది రాసినందుకే ముస్లిం మతఛాందసవాదులు తస్లీమా నస్రీన్‌కు మరణదండన విధిస్తూ “ఫత్వా” జారీ చేశారు. 1993 సెప్టెంబరులో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. ఈ నవలతో నస్రీన్‌కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.