LENO by DAVIDS VAGDEV Telugu book cover

LENO

by DAVIDS VAGDEV

₹199
In stock · 39 available
PublisherDAVIDS VAGDEV
LanguageTelugu
ముందుమాట-సందేశం నా హృదయం నుండి..... . ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు కొలువైయుంటారన్నది అక్షరసత్యం. ఎప్పటినుండో నా హృదయ వ్యవస్థలో నిర్మించుకున్న ప్రేమ శిఖరాక్షరాలకు నిదర్శనం ఈ చిన్ని పుస్తకం. ప్రతి వ్యక్తి తన ఆలోచన్లకి అనుగుణంగా తన మనస్సులో ఒక వ్యవస్థను నిర్మించుకొని జీవించుటకు ప్రయత్నిస్తాడు. నేడు - సమాజంలో ప్రేమ ఒక ఆయుధమై ప్రేమను బ్రతికించుకోడానికి ప్రేమను ప్రేమే బలితీసుకుంటుంది. నిర్భందపు, నిరంకుశ, నిస్సాహయిక ప్రేమలకు ఈ నా సందేశము ఒక మార్గదర్శకమై మూర్ఖపుప్రేమల జ్ఞాననేత్రాలను తెరిపిస్తాయనే తపనతో చేసిన ప్రయత్నమిది. "మోడుబారిన మొక్కను నీరు పోసి, మళ్ళీ వికసింపచేయులాగున" ఈ రచన కావ్యం ద్వారా మూర్ఖుల ప్రేమ హృదయాలు విరభూస్తాయనే నమ్మకంతో నా హృదయ కాన్వాసు నుండి అక్షరాలుగా జాలువారుతున్నాయి. ప్రేమ విఫలమై కొందరు, వరకట్న దాహానికి గురై కొందరు రకరకాలుగా ఇలా తనను తాను చాలించుకుంటూ రాక్షస ప్రేమలకు గురౌతున్నది. బలైపోతున్నది స్త్రీ. పైకి చెప్పుకోలేక, అనుభవించనూలేక అధోగతి పాలౌతుంది. ఎక్కువ శాతం ప్రేమ కోసం స్త్రీలే ఆత్మార్పణలు చేసుకుంటున్నారు. చితికిన నూరు ప్రేమ గాథలలో తొంబై తొమ్మిది శాతం జీవితాలు స్త్రీల బ్రతుకులే నలిగి నశించిపోతున్నాయి. అమాయకంగా ప్రేమను నమ్మి, అవసరాలకు ప్రేమను నమ్మి, అనుబంధాలకు ప్రేమను నమ్మి, ఆనందాలకు ప్రేమ పేరుతో మోసపోయి, చివరికి వ్యభిచార గృహాల్లో, యాసిడ్ దాడుల్లో, మైకం కమ్మిన నేత్రాలకు బలైపోతున్నారు. తాగుబోతు భర్తల ఆవేశాలకు చితికిపోతున్నారు. కిరాతకంగా హత్యలకు గురౌతున్నారు. బలవన్మరణాలకు లొంగిపోతున్నారు. స్త్రీ ప్రకృతికి ప్రతీక - ప్రకృతి అందాలకు నగీషి అని మరచి ఉన్మాదుల్లా చెలరేగిపోతున్నారు. మగువ మరచిపోలేని ఓ మధురమైన జ్ఞాపకం. ఆడది అతిశయ సంబరాలకు ఒక బహుమతి ఆనంద జీవితానికి రహస్యనిధి.