LOCKDOWN VETALU - MARIKONNI KATHALU by ATHALURI VIJAYALAKSHMI Telugu book cover

LOCKDOWN VETALU - MARIKONNI KATHALU

by ATHALURI VIJAYALAKSHMI

₹125
In stock · 63 available
PublisherATHALURI VIJAYALAKSHMI
LanguageTelugu
“ఏవండీ వచ్చేసింది” తనగదిలో మంచం మీద రెండు దిళ్ళు వేసుకుని వెనక్కి వాలి దర్జాగా కరీనాకపూర్ సినిమా చూస్తూ కొత్తగా లభించిన విశ్రాంతి జీవితాన్ని అనుభవిస్తున్న మన సుబ్బారావుగారు, బయట హాల్లో ఉన్న టివిలో తెలుగు సీరియల్ చూస్తున్న సతీమణి ఒక్కసారిగా గావుకేక పెట్టేసరికి ఒక్కసారి ఉలిక్కిపడి ముందు బోర్లా పడి తరవాత పక్కకి పడి, ఆ తరవాత వెల్లకిలా పడి గభాల్న లేచి కూర్చుని అంతకన్నా గట్టిగా "ఏవోచ్చిందే" అని అరిచాడు. అరిచాడే కానీ కరీనా కపూర్ అందం మీద నుంచి దృష్టి మళ్ళించలేక తిరిగి పడుకుని సినిమా చూడడం మొదలుపెట్టాడు. "ఏం రావడం ఏంటండి నా పిండాకూడు... రావద్దు అనుకున్నదే వచ్చింది. ఇది రావద్దని వేయి దేవుళ్ళకి మొక్కుకున్నాను... అయినా వచ్చింది...ఇప్పుడు ఊరి శివార్లకి వచ్చింది... మన ఇంటికి, మన కాలనీకి రావడం ఎంతసేపు! అయ్యో నా మొక్కులన్నీ వృధా అయాయి. దేవుడా! ఏది జరగద్దనుకున్నానో అదే జరిగింది దేవుడా..” లాక్ డౌన్ వెతలు. సమాలు