LONDON TO AMARAVATHI by DR.GUJJU CHENNA REDDY Telugu book cover

LONDON TO AMARAVATHI

by DR.GUJJU CHENNA REDDY

₹300
In stock · 56 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788197696121
LONDON TO AMARAVATHI (Novel) By Dr. Gujju Chenna Reddy ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ గ్రూప్వన్ ఉద్యోగాన్ని కాదని ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో ఆచార్యునిగా సేవలందిస్తున్న గుజ్జు చెన్నారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రెండు పిహెచ్.డిలు అందుకున్నారు. 215 పరిశోధక వ్యాసాలు రాసి, తన గైడెన్స్లో 42 డాక్టరేట్లు పూర్తి చేయించి డిగ్రీ, హైస్కూల్ విద్యార్థులకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ రాసి, తెలుగు దినపత్రికలకు కాలమిస్ట్, ఆలిండియా రేడియో, దూరదర్శన్లకు ఉపన్యాసకునిగా సేవలందిస్తున్న ఇతని మొదటి పుస్తక రచన 'సిక్కోలు కథలు,' మొదటి నవల 'మరోమహాత్మ' రెండవ నవల ఈ 'లండన్ టు అమరావతి'. 'లండన్ టు అమరావతి' చారిత్రక నవల. క్యాంపస్ నవల. భారతదేశంలో చారిత్రంగ జరగని ఒక నేపథ్యం : 'బ్రిటీష్ వారు, ఇతర ఐరోపా వాసులు భారతదేశాన్ని 1947లో వీడి వెలిపోలేదు. వారు భారతీయులతో కలసి జీవనం చేస్తూ నేటికీ భారతీయ పౌరులుగానే ఉన్నారు' అనే భావాలను కథా వృత్తాంతంగా తీసుకుని రాసిన నవల. వారు రాసుకున్న కలోనియల్ కాన్స్టిట్యూషన్లో ఎంతగానో అభివృద్ధి చెందిన అమరావతి మహానగరానికి మేయర్ శాంసన్ రాజన్. అతని స్వస్థలం లండన్ నగరానికి అరవైమైళ్ళ దూరంలో ఉన్న అబింగ్డన్. రాజన్ భార్య ప్రముఖ కూచిపూడి నర్తకి పద్మావతి. వారికుమార్తె రాణి మెటెల్డా. ఇంగ్లాండ్ దేశానికి, భారతదేశానికి ఎంతో అవినాభావ సంబంధం ఉన్న దృష్ట్యా లండన్ మహానగరంలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ జర్నలిజం మొదటి సంవత్సరం చదివి, రెండవ సంవత్సరం చదువుకోసం అమరావతిలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి వచ్చింది. ఇండో-ఆంగ్లియన్ అయిన రాణి మెటెల్డా కథే ఈ 'లండన్ టు అమరావతి' క్యాంపన్ నవల. భిన్న సంస్కృతుల కలయికతో ఏర్పడిన ఒక కొత్త సంస్కృతి, క్యాంపస్లో ఆటపాటలు, యూరో ఇండియన్స్ మనస్తత్వం, వారి ప్రేమ పల్లకిలు ఈ నవలను నడిపించాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN 978-81-976961-2-1 9788197 696121