LOPALI MAATA by ADARSINI MEDIA Telugu book cover

LOPALI MAATA

by ADARSINI MEDIA

₹120
In stock · 4 available
PublisherADARSINI MEDIA
LanguageTelugu
ఏ శిశువుకైనా అమ్మఒడే తొలి బడి. ఆ బడిలో అక్షరాలు దిద్దకపోయినా ఆది గురువు ఐన అమ్మ ద్వారా ఎన్నో అర్థవంతమైన పదాలను అవగతం చేసుకుంటాం. తెలియక వేసే తప్పటడుగులను తండ్రి సరిదిద్దితే, తెలిసి వేసే తప్పటడుగులను గురువు సరిదిద్దుతాడు. చిమ్మచీకటిని సూర్యుడు పారద్రోలితే, అజ్ఞానాంధకారాన్ని గురువు పారద్రోలుతాడు. నాలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, నా జీవితానికే పరమార్థాన్ని ప్రసాదించిన సద్గురువు శ్రీ సుబ్రహ్మణ్యంగారు. "భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడు బయట ఎక్కడాలేడని, తనలోనే తానై ఉన్నాడు" అనే పరమ సత్యాన్ని ఎరుక పరచిన పరమానంద స్వరూపుడు నా గురువుగారు. "సృష్టిలో ప్రతీదీ ఈశ్వరుని ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. దేనికీ చింతించనవసరంలేదు. నీ జీవితంలో నీకు ఏ పరిస్థితులు ఎదురైనా అధైర్యపడకుండా, అందుకు 'నేను అర్హుడినే' అని నిశ్చింతను కలిగి ఉండు" అనే పరమ తత్త్వాన్ని ప్రబోధించిన పరమేశ్వరుడు నా గురువుగారు. అలా, నా జీవితానికి సన్మార్గాన్ని నిర్దేశించిన మార్గదర్శి నా గురువుగారు. వారి దివ్య పాదారవిందములకు ఇదే నా నమస్సుమాంజలి.