
LOUKIKATHATHVAM - PRAJASWAMYAMPAI MATHONMADULA DAADI
₹120
In stock · 458 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126641
స్వాతంత్ర్య పోరాట కదనరంగానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి నూరు సంవత్సరాలకు మించిన చరిత్ర ఉన్నది; దానితోపాటు ఆనాటి పోరాటంలో దూకిన యువ కమ్యూనిస్టు కిశోరాల పార్టీ అయిన నేటి భారత కమ్యూనిస్టు పార్టీ నూరు సంవత్సరాల సంబరాలు చేసుకుంటోంది. స్వాతంత్య్ర పోరాటంలో వీసమెత్తు కూడా భాగస్వామ్యంలేని సంఘ్ పరివార్ శక్తుల రాజకీయ ప్రతినిధులు రాజ్యమేలుతున్నారు. మొన్నటివరకు ముసుగులు ధరించిన ఈ చీకటిశక్తులు, తమ ముసుగులు తీసివేసి బాహాటంగా తమ లక్ష్యాలను ప్రకటిస్తూ, దేశ లౌకిక మూలాలను దెబ్బతీస్తూ, సంస్థాగత వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, సాధ్యంకానప్పుడు కూల్చివేస్తూ రాజ్యమేలుతున్నారు; వ్యవస్థను తమ గుప్పిట్లో ఉంచుకుని నలిపివేస్తున్నారు. దేశంలో “చట్టబద్ధంగా” చేస్తున్నట్లుగా ఇంత దుర్మార్గ, దుష్ట చింతన అకృత్యాలు జరుగుతుంటే లౌకిక, వామపక్ష శక్తుల కేకలు, మూలుగులు జనానికి వినిపించడం లేదు; వినిపించినా భయభ్రాంతులై నిశ్శబ్దంగా ఎందుకు ఉంటున్నారో? విజ్ఞులే ఆలోచించాలి.