
LOYA MARIKONNI KATHALU
₹140
In stock · 209 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
loya marikonni kathalu By b. ajay prasad తెల్లని పలుచటి తడిబట్టను ముఖంమీద కప్పుకుని లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది అజయ్ ప్రసాద్ కథలు చదివితే. అంతా కనబడుతూ ఉంటుంది; ఇంకా కనబడనిది ఏదో వుందని కూడా తెలుస్తూవుంటుంది. స్పష్టాస్పష్టం. అజయ్ మానసిక ప్రపంచంలోని మనుషులు ఒక దారప్పోగు లాంటి బలహీన బంధాన్ని మాత్రం ఉంచుకుని సంచరించే జీవులు. అయినా వీరందరిలోనూ ఏదో తెలియని దుఃఖం. అది పొగిలి ఏడ్చేదీ కాదు; బయటకి వ్యక్తం చేయగలిగేదీ కాదు. మొత్తంగా శరీరమంతా జీవితమంత లోతుగా వ్యాపించివున్న దిగులు. ఎక్కడో దూరంగా ఏ బైరాగో తన మొత్తం అనుభవసారాన్నంతా గొంతెత్తి తనలో తానే ఏ తత్వంగానో పాడుతూవుంటే మనకు తెలియకుండానే దానిలో లీనమై అంగీకారంగా తలవూగుతూ వుండగా కనీకనబడని చెమ్మతో కళ్ళు మసకబారే పఠనానుభవం. - పూడూరి రాజిరెడ్డి ఈ కథల్లో తీరని దిగులుతో కల్పన సాకుగా అజయ్ తన జ్ఞాపకాల్ని నిమురుకున్న ప్రతి సందర్భమూ నాకు నచ్చింది. కల్పనలు జ్ఞాపకాలుగా మారుతున్న సందర్భాలు కూడా. - మెహెర్ అజయ్ ప్రసాద్ కథలన్నింటిలోనూ అతడి హృదయంలో గూడుకట్టుకొని నివసిస్తున్న దిగులు వెదజల్లే అన్ని రంగులూ మసక వెలుతురులో కనిపించి మౌనానికి గురిచేస్తాయి. ఖేయాస్ అన్న కథ రాసినవాడు నా మిత్రుడు అని తల్చుకున్నప్పుడు సంబరంగా అనిపిస్తుంది. కొన్ని కథల్ని రచయితలు ఎంచుకొన్నట్లు కథే కొన్నింటి కోసం రచయితల్ని ఎంచుకుంటుందేమో. ఇందులో ఖేయాస్, లోయ లాంటి కథల కోసం అజయ్ ప్రసాద్ ఎంచుకోబడ్డాడని అనుకుంటాను. తెల్లకాగితాల్ని ఉన్నవాటికన్నా ఉన్నతం చేసినందుకు మిత్రుడికి అభినందనలు. భగవంతం ఆంధ్ర పబ్లిషియా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004