
LUCKY SAHASALU
by PATIBANDLA SETHU MADHAVARAO
₹60
In stock · 36 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
లక్కీ సాహసాలు ముందు మాట లక్కీ సాహసాలు అనే ఈ పుస్తకం నేను చేసిన సాహసం. ఇందులో ఆరు కథలు వున్నాయి. లక్కీ అనే పదేళ్ళ అమ్మాయి జీవితంలో ఎదుగుతూ ప్రమాదకరమైన, సాహసమయిన సన్నివేశాల్లో యిరుక్కుని బయటపడుతూ వుంటుంది. అన్నీ కల్పితాలే. కొంత అడ్వెంచర్, కొంత సైన్సు, కొంత త్రిల్ కలిపి పాఠకులకు వినోదం కల్పించాలన్న ప్రయత్నమే ఇది. మిత్రులు శ్రీ మల్లాది హనుమంతరావుగారితో నేనొక రోజు 'కథలు రాద్దామను కుంటున్నాను. మొత్తం ఫాంటసీ యే మూలం' అని చెప్పగానే, ఆయన 'తప్పకుండా రాయండి' అని ధైర్యం చెప్పారు. అంతేకాక ఎడిటోరియల్ సహాయం కూడా చేశారు. వారికి కృతజ్ఞతలు. ఈ కథల్లో హీరోయిన్ ప్రాధాన్యం ఎక్కువ. అరుదవుతున్న ఆడశిశువుని మనసులో పెట్టుకుని పదేళ్ళ హీరోయిన్ చుట్టూ సన్నివేశాలు కల్పించబడ్డాయి. రచయిత ఫాంటసీని మూలంగా ఎంచుకుంటే అంతులేని స్వాతంత్య్రం వుంటుంది. ఆ సన్నివేశాలు నిజ జీవితంలో ప్రాణాంతకాలు, పిల్లలు, "నేను పాలుతాగుతాను కాబట్టి నాకు బలం వుంది. నాకేమి కాదు", "దేముడికి దణ్ణం పెట్టుకున్నాను. నాకేమీ కాదు”, అనోదు సాహసాలుచేసే ప్రయత్నాలు చేయకుండా తల్లిదండ్రులు గైడెన్స్ యివ్వాలి. సైన్సు మీద పత్రికల్లో రకరకాల వ్యాసాలు, సందేహాలకి సమాధానాలు వస్తున్నాయి. ఇది హర్షించ దగ్గ విషయం కాని, అది చదవ దలచుకున్నవారే చదువు తారు. కథలో సైన్సు మీద సంభాషణలు / చర్చలు వుంటే కథతో పాటు అవి కూడా చదివి సైన్సు మీద ఆసక్తి పెరగొచ్చు అనే ఆశతో సైన్సు రాశాను. సన్నివేశాలు, శైలి వినూత్నంగా వుండి పాఠకులని, ఈ కథలు ఆకర్షిస్తాయని ఆశిస్తున్నాను. హసీ రీడింగ్. హైదరాబాదు. పాటిబండ సేతుమాధవరావు