M.D GARI BHARYA - 100 by SUDHAMURTHY Telugu book cover

M.D GARI BHARYA - 100

by SUDHAMURTHY

₹100
In stock · 2 available
PublisherALAKANANDA PRACHURANALU
LanguageTelugu
శ్రీకాంత్, శ్రీమతి ఇరుగుపొరుగువాళ్ళు. చదువులో ఒకరినిమించిన వారొకరు. ఇద్దరిమనస్సులు కలిశాయి. వివాహబంధంతో ఏకమయ్యారు. సాఫ్ట్వేర్ కంపెనీలో చేరిన శ్రీకాంత్ స్వయంకృషితో, ప్రతిభతో అంచలంచెలుగా ఎదిగి అగ్రస్థానానికి చేరుకుంటాడు. ఇటు శ్రీమతి పైచదువులు చదవాలన్న ఆకాంక్షను అణచుకొని శ్రీకాంత్ భార్య పాత్రలో ఒదిగిపోతుంది. అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్ను కలసినప్పుడు తను ఏం కోల్పోయిందో శ్రీమతికి అర్ధమవుతుంది. తన జీవితం అచేతనంగా, నిరర్ధకంగా, శూన్యంగా మారిందన్న వాస్తవం ఆమెకు బోధపడుతుంది. స్వార్ధం, పైపైకి ఎదగాలన్న ఆరాటాల నడుమ వైవాహిక బంధాలు ఏవిధంగా నలిగిపోతున్నాయో, సంసారాలు ఎలా ఛిధ్రమవుతాయో తెలిపే ఎమ్.డి. గారి భార్య సుధామూర్తి తొలి నవల.