
MA NANNAGARU (KEERTHISESHULAINA 62 MANDI SAHITHI PRAMUKHULA JEEVITHA VIDHANALU)
₹400
In stock · 1 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
MAA NAANNAGAARU Life Sketches of Literary Personalities by Dwana Sastry తెలుగు సాహిత్యంలో 'అమ్మ'ను గురించిన గ్రంథాలే తప్ప 'నాన్న'ను గురించిన రచనలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కాని డా॥ ద్వా.నా. శాస్త్రి కృషి వల్ల అరవై రెండు మంది దివంగత సాహితీమూర్తుల వారసులు ఆర్థంగా వినిపించిన అనుభూతుల సంకలనం 'మా నాన్నగారు' ఆ లోటును తీరుస్తుంది. ఒక్కొక్క వ్యాసం ఆ సాహితీమూర్తి అరుదైన వ్యక్తిత్వాన్ని, సాహితీవైభవాన్నీ పాఠకుల కళ్లముందు నిలిపి అబ్బురపరుస్తాయి. వారి జీవిత విశేషాలు ఇతరులకు స్ఫూర్తిని కలిగిస్తాయి. నిజంగా ఈ గ్రంథం ఆధునిక తెలుగు సాహితీలోకంలో అరుదైన గ్రంథం. ఎప్పుడూ సరికొత్త ఆలోచనలతో పాఠకుల ముందుకు వచ్చే ద్వా.నా. శాస్త్రి అపూర్వసృష్టి 'మా నాన్నగారు’. వేలాది గ్రంథ సమీక్షలతో గిన్నీస్ రికార్డులోకి చేర్చదగిన అర్హత సాధించిన ప్రముఖ విమర్శకుడు డా॥ ద్వా.నా. శాస్త్రి 'సమీక్షక సవ్యసాచి'గా కీర్తించబడినాడు. తెలుగు సాహిత్యచరిత్రను పోటీ పరీక్షల విద్యార్థులకు సరళమైన శైలిలో అందిస్తూ తెలుగు భాషా వ్యాప్తికి నిరంతరం పాటుబడుతున్న సాహితీవేత్త. ఇప్పటికి నలభై గ్రంథాలు రచించి, నిత్యసాహితీ చైతన్యం కలిగి దేశవిదేశాలలో ఎన్నో సత్కారాలు పొందిన ద్వా.నా.శాస్త్రి కీర్తికిరీటంలో ఈ గ్రంథం ఒక కలికితురాయి అవుతుందనడంలో సందేహం లేదు. తాళ్లపల్లి మురళీధర గౌడు