
MAA BADI
₹220
In stock · 37 available
PublisherMODUGULA RAVIKRISHNA
LanguageTelugu
మా హెడ్మాస్టరుగారు అరవఫారం బి లో నుంచి వస్తోన్నారని అలజడి ప్రారంభమై అంతలో బడి రెండోకొస క్లాసులకంటా ప్రాకింది. ఏ Dy.S.P.యో పెరవలి మొగలో ఉన్నాడన్నా వస్తోన్నాడన్నా పెరవలి నుంచి వచ్చే కార్లవాళ్లు ఎదర కారు డ్రైవర్లతో 'వస్తూన్నాడు. జాగ్రత్త' అంటో చెప్పి తమ పరోపకార పారీణతను ప్రదర్శించుకుంటో వచ్చేటట్లు 6వ ఫారము బి ప్రక్క నుంచి వచ్చే విద్యార్థులు "వస్తోన్నాడ్రోయి" అంటో ఉప్పందించుకుంటో పోయి దూకుడుగా తమ క్లాసురూముల్లో దూరుతున్నారు. వరండాల్లోను, School square లోను తచ్చాడుతోన్న ఏర్భాయి కుర్రాళ్లు ఎక్కడివాళ్లు అక్కడే అంతర్ధానమవుతూన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రక్కప్రక్కలకు తప్పుకుంటూ తమ తమ క్లాసుల్లోకి వెళ్తూన్నారు. సర్వేజనాః, స్కూలందరికీ ఆయన యెదుట బడడమంటే సింహస్వప్నం. సెకండు ప్యూను సూరిగాడు పరుగున వచ్చి, పరుగు ఆయాసం పెదవులపైకి రాకుండా దిగమ్రింగుతో, గత గంట నుంచి హెడ్మాస్టరు గారి గది గుమ్మాన్ని అంటిపెట్టుకున్నట్లుగానే అగుపిస్తోన్నాడు. అవును. అదిగో! చంద్రికాధవళంగా, చిక్కగానున్న దాక్షిణాత్య బొద్దంచుల ధోవతీ, దానిపై నల్లటి పొట్టి క్లోజుడుకోటూ, ఆ కోటుపై జేబు ప్రక్క నుంచి దిగజారి వక్షస్థలం మీద చెంగలిస్తోన్న వెండి అడ్డకమ్మి వాచీగొల్సు, కొసలు తేలని గ్లాస్కోమల్లు గుండ్రపాగా, చూపులకు కొద్దిమాత్రం వలంగానే కన్పిస్తోన్న ఆ చామనచాయ మనిషి హెడ్మాస్టరుగారే. వామహస్తం కోటుజేబులోనికి గెంటి, రెండోచేత్తో సన్నటి పేపజూక త్రిప్పుకొంటో వచ్చే గమనగతి అక్షరాలా వారిదే. ఆనాటికి అచ్చొత్తిన వివిధ సాహిత్య, శాస్త్ర, యితిహాస ఆంగ్ల , Browning's picture of Napolean (as if to balance the prone brow oppressive with its mind) స్ఫురణకు తెస్తో కుడిభుజం వైపుకు కాస్త వంచిన పెద్ద శిరస్సు, బింక మొల్కుతోన్న మోము, పట్టుదలను సూచిస్తోన్న పెదవులు, జీవితంలో తిన్న ఢక్కామొక్కీలను స్ఫురణకు తెస్తోన్న దృఢమైన నుదుటి రేఖలు, అసమాన మేధాసంపన్నతను సాక్షాత్కరింపజేస్తోన్న సువిశాలఫాలం, విజ్ఞాన వికాసాన్ని ప్రతిబింబిస్తోన్న విశాలమై లోతైన కాటుక కళ్లు, కండతేలిన మెడభాగం, ఆయన్ని వినిగాని యెన్నడును కని యెఱుగని వారికి సహితం వారే హెడ్మాస్టరుగారని చెప్తాన్నాయి. దానికి దాఖలాగ పీరియడ్ అయిందని గంట కొట్టడం తర్వాయిగా బిలబిల్లాడుతో తమ తమ