
MAA BHOOMI
₹80
In stock · 165 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
'మా భూమి' నాటకం 1947లో ప్రథమ ముద్రణ పొందింది. ఇది పదో ముద్రణ. వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కృష్ణాజిల్లా రచయితలు వాసిరెడ్డి భాస్కరరావు, సుంకర సత్యనారాయణ 'మా భూమి' నాటకాన్ని రచించారు. ఈ నాటకం తెలుగునాట ప్రేక్షకులను ఎంతో చైతన్యపరిచింది. ఉర్రూతలూగించింది. ఉద్యమానికి ఊపునిచ్చింది. పోరాటేతర ప్రాంతాల ప్రజల నైతిక మద్దతును కూడగట్టింది. ఆనాటి ప్రభుత్వానికి వెన్నులో వొణుకు పుట్టించింది. నిషేధానికి గురయింది. నేడు ఈ నాటకం రంగస్థలం నుండి తెరమరుగయినప్పటికీ ప్రచురణలు పొందుతూనే ఉందంటే దాని చారిత్రక నేపథ్యం అంత గొప్పది. ఈ నాటక రచనలో సిద్ధాంత బలాన్ని, జవాన్ని కూర్చడంలో వామపక్ష 'అలిజం' పితామహులు చంద్రం (మద్దుకూరి చంద్రశేఖరరావు) గారు, అద్భుత ప్రదర్శనగా రూపొందించటంలో ప్రజానాట్యమండలి తొలితరం నాయకులు, సుప్రసిద్ధ దర్శకులు డాక్టర్ గరికపాటి రాజారావుగారు కీలకపాత్ర పోషించారు. ఈ నాటకానికి ఇంత గొప్పదనం ఎలా వచ్చిందో నేటితరం అవగాహన చేసుకునేందుకు సహాయపడాలనే ఉద్దేశంతో కొన్ని అంశాలను నాటకం చివర అనుబంధంగా చేర్చాం. మా భూమి నాటకాన్ని నిషేధించినప్పుడు నాటి ఆంధ్ర ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి డాక్టర్ గరికపాటి రాజారావు " 'మా భూమి' ప్రదర్శనపై మద్రాసు ప్రభుత్వపు నిషేధం" అని ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనను, నాటకంలో ప్రధాన పాత్ర పోషించిన నాటి ప్రజానాట్యమండలి కళాకారులు, ప్రముఖ